నాపై ఆరోపణలన్ని 'మెగా' కుట్ర..

     Written by : smtv Desk | Sun, Apr 15, 2018, 02:18 PM

నాపై ఆరోపణలన్ని 'మెగా' కుట్ర..

హైదరాబాద్, ఏప్రిల్ 15 : టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై ఇటీవల డిబేట్ లలో పాల్గొంటున్నాడు సినీ విమర్శకుడు కత్తి మహేష్. తాజాగా మహేష్ తనపై రేప్ చేయబోయాడంటూ సునీత అనే జూనియర్ ఆర్టిస్టు ఆరోపించి౦ది. అంతేకాదు అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని తెలిపింది. ఈ ఆరోపణలపై కత్తి మహేష్ స్పందించారు. సునీత తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైందన్నారు. ఒకట్రెండు సార్లు కలిశానని.. డబ్బులు అవసరమైతే చిన్న చిన్న సాయాలు కూడా చేశానన్నాడు.

ఈ ఘటనకి తనకు అసలు సంబంధం లేదని.. లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. అది నిరూపించుకోవడంలో భాగంగా సునీత మీద నేను 50 లక్షలకి పరువునష్టం దావా వేస్తున్నానని తెలిపాడు. అంతేకాకుండా అయితే ఈమె వెనుక కొణిదెల ప్రొడక్షన్స్ ఉందని ఆరోపిస్తూ కత్తి ఆ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తను పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకు కావాలనే సునీతను తన మీదికి ఉసిగొల్పుతున్నారని.. ఈ కుట్ర వెనుక కొణిదెల ప్రొడక్షన్స్ ఉందని ఆరోపిస్తూ కత్తి ఆ సంస్థపై కూడా పరువు నష్టం దావా వేస్తానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Untitled Document
Advertisements