పవన్ పై వర్మ కామెంట్..!! హెచ్చరించిన రామజోగయ్య..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 02:51 PM

పవన్ పై వర్మ కామెంట్..!! హెచ్చరించిన రామజోగయ్య..

హైదరాబాద్, మే 14 : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏదో ఒక వివాదంలో నిత్యం వార్తల్లో ఉంటారు. ఇటీవల పవన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మరోసారి పవన్ పై విరుచుకపడ్డారు. పవన్‌ అలిపిరి కాలినడక మార్గంలో తిరుమల చేరుకున్న సంగతి తెలిసిందే. నిన్న ఉదయం ఆయన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని కాలినడకన వెళ్తూ అలసిపోయిన పవన్‌.. కుర్చీలో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకున్నారు.

అయితే ఈ సందర్భంగా తీసిన ఒక ఫోటోను వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "పవర్ స్టార్ పవర్ పుల్ ఎనర్జీ కి పవర్ ఫుల్ ఉదాహరణ" అంటూ పోస్ట్ చేశారు. దీనికి పవన్ అభిమానులు వర్మపై మండిపడుతూ.. కామెంట్లు పెడుతున్నారు.

ఈ విషయంపై ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి స్పందించారు. వర్మను హెచ్చరిస్తూ.. "కెలకమాకు సామీ.. కాస్త వాతావరణం మర్చిపోతే ఆ పని అందరు చేస్తారు. ఇది మీకు హుందా అయిన పని కాదు. తెలుగు ప్రజల సమయం వృథా చేయకండి. ఏమన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్‌ చేసి, మాట్లాడుకోండి" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Untitled Document
Advertisements