మై రౌడీస్, నేను మే 18కి రావట్లేదు..

     Written by : smtv Desk | Mon, May 14, 2018, 04:07 PM

మై రౌడీస్, నేను మే 18కి రావట్లేదు..

హైదరాబాద్, మే 14 : హీరో విజయ్ దేవరకొండ రాహుల్ సాంస్కృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "టాక్సీవాలా". జర్నీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే థ్రిల్లర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ నెల 18 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ఇది వరకే చిత్ర యూనిట్ ప్రకటించింది. కాని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఈ మేరకు విజయ్ తన ట్విట్టర్ లో .. "మై రౌడీస్, నేను మే 18కి రావట్లేదు. మిమ్మల్ని ఏడిపించేందుకు, గట్టిగా అరిపించేందుకు, కడుపుబ్బ నవ్వించేందుకు మరికొంచెం టైమ్ తీసుకుని మరీ రాబోతున్నాను. ఎందుకంటే కొన్ని ఫైనల్ టచెస్ కోసం కొంచెం టైమ్ తీసుకుని మీ ముందుకు రాబోతున్నాను. వారంలోపు జూన్‌లో ఏ డేట్‌న రిలీజ్ చేస్తామనే విషయాన్ని వెల్లడిస్తాం. ప్రస్తుతానికి నేను నా టాక్సీపై కూర్చుని నవ్వుతూ ఉన్న పిక్‌ని చూసి ఎంజాయ్ చేయండి" అని ఒక ఫోటోను పోస్ట్ చేశాడు.Untitled Document
Advertisements