చదువు 'కొందామా".. చదువు 'ఇద్దామా'..

     Written by : smtv Desk | Mon, Jun 04, 2018, 02:29 PM

చదువు 'కొందామా

హైదరాబాద్, జూన్ 4 : వేసవి సెలవులు ముగిశాయి. ఇక స్కూల్, కళాశాలల హడావిడి మొదలైంది. పిల్లలను చదివించే తల్లి దండ్రులు ఇక ఫీజులు, ఇతరత్రా ఖర్చులపై దృష్టిపెట్టారు. ప్రస్తుత సమాజంలో చదువు కూడా వ్యాపారంగా మారిపోయిన విషయం అందరికి తెలిసిందే. వచ్చే రాబడి, చేసే ఖర్చులు, అన్ని బేరీజు వేసుకొని కాస్త స్థోమత కలిగిన వారు కార్పొరేట్ సంస్థల వైపు, పేదవారు సర్కారీ స్కూల్ ల వైపు పరుగులుతీస్తారు.

ఇక 'మధ్య' తరగతి కుటుంబాల పరిస్థితి చెప్పలేనిది. అటు వెళ్తే బోలెడు ఫీజులు.. ఇటు వెళ్తే ప్రభుత్వ బడులు పర్వాలేదు అనిపించినా... చివరికి కార్పొరేట్ వలలో చిక్కుకుపోతారు. అదే ఆ సంస్థల మాయాజాలం. అప్పులు చేసి మరి జాయిన్ చేస్తారు. జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసిన ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఎందుకంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ చేతికి తాళాలు ఇచ్చింది మనమే. విద్య వ్యవస్థ వారి చేతిలోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే రాజకీయ నాయకుల సంస్థేలే చక్రం తిప్పుతున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... ప్రభుత్వ బడుల్లో చదివించాలనే చెప్పేది వారే. మరో వైపు వారి సంస్థల ఉన్నతి కోసం పనులు చక్కబెట్టేది వారే. ఎన్ని చట్టాలు చేసిన ఎదో ఓక లూప్ హోల్ తీసుకొని వాటిని వారికి చుట్టాలుగా మార్చుకొంటారు. అన్ని తెలిసిన సామాన్య ప్రజలు అలా చూస్తూ ఈ బాధలను భరిస్తారే తప్ప తిరగబడరు.

ఇక్కడ మారాల్సింది ప్రభుత్వ అధికారులు.. రాజకీయనాయకుల ధోరణి. భావిబారత పౌరులుగా మన యువతను సరైన మార్గంలో పెట్టాలంటే విద్య చాలా అవసరం. ఇందుకోసం ప్రభుత్వమే ఈ చదువు "కొందాం " అనే మాట నుండి చదువు 'ఇద్దాం' అనే ధోరణిలోకి రావాలి. ఇందు కోసం ప్రతి వ్యక్తి ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మనం కలలు గనే అభివృద్ధి భారత్ సాకారం అవుతుంది. విద్య అనేది మిధ్యా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు పాత్ర పోషించాలి. ముఖ్యంగా ప్రభుత్వం ఇందుకోసం తగు చర్యలు చేపడితే ఎంతో మంది తెలివిగల విద్యార్ధులు దేశ ప్రగతిలో భాగం అవుతారు.














Untitled Document
Advertisements