12ఏళ్ల బుడతడు.. రికార్డు సృష్టించాడు..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 01:28 PM

 12ఏళ్ల బుడతడు.. రికార్డు సృష్టించాడు..

చెన్నై, జూన్ 24 : ప్రపంచంలోనే అతిపిన్నవయసు గల రెండో గ్రాండ్‌ మాస్టర్‌గా చెన్నైకి చెందిన 12ఏళ్ల బుడతడు రికార్డు సృష్టించాడు. ఇటలీలో జరుగుతున్న గ్రెడైన్‌ ఓపెన్‌లో శనివారం జరిగిన ఎనిమిదో రౌండ్‌ గేమ్‌లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల్లో ఇటలీ గ్రాండ్‌మాస్టర్‌ లూకా మోరోనిపై గెలుపొందాడు. ప్రస్తుతం ప్రజ్ఞ వయసు 12సంవత్సరాల 10నెలలు. ప్రపంచంలోనే అతి చిన్న వయసులో గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన ఘనత ప్రస్తుతం ఉక్రెయిన్‌కు చెందిన సెర్గే కర్జాకిన్‌ అనే చిన్నారి పేరు మీద ఉంది.

2002లో కర్జాకిన్‌కు 12సంవత్సరాల ఏడునెలల వయసున్నప్పుడు 2002లో ఈఘనత సాధించాడు. ఇప్పుడు దాదాపు 16ఏళ్ల తర్వాత పన్నెండేళ్లకే ఈ ఘనత సాధించిన రికార్డును ప్రజ్ఞానంద తన పేరిట లిఖించుకున్నాడు. 2017లో ఇటలీలో జరిగిన ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌లోనూ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. అంతేకాకుండా ప్రపంచ చెస్‌ చరిత్రలో 10సంవత్సరాల తొమ్మిది నెలలకే అతిచిన్న అంతర్జాతీయ మాస్టర్‌గా నిలిచిన రికార్డు ఇతనిదే. ప్రపంప మాజీ ఛాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటి మరీ ఈ ఘనత సాధించాడు.

Untitled Document
Advertisements