బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 02:54 PM

బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న 'శైలజా రెడ్డి అల్లుడు'

చిన్న సినిమాల దర్శకుడుగా ఇండస్ట్రీ కి పరిచయం అయి తెలుగు సినిమాలలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు మారుతీ, ఈయన సినిమాలకి అటు యూత్ నుండి మరియు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా ఆదరణ లభిస్తుంది. గతం లో తన దర్శకత్వం లో వచ్చిన సినిమాలే అందుకు సాక్ష్యం, కథ ఏదైనా తన మార్కు కామెడీ ని పండించి ప్రేక్షకులను అలరించడం లో సిద్దహాస్తుడిగా మారాడు మారుతీ.
అయితే వినాయక చవితి సందర్భంగా ధియేటర్ లలో సందడి చేస్తున్న సినిమా 'శైలజా రెడ్డి అల్లుడు'. నాగచైతన్య, అను ఇమన్యుఎల్ హీరో హీరోయిన్ లుగా, రమ్యకృష్ణ అత్త పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లను రాబడుతుండడం తో డిస్ట్రిబ్యుటర్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు, పాత కథే అయినా భారీ తారాగణం మంచి నిర్మాణ విలివలతో తీయడం అందులోనూ పండగ సీజన్ కావడం తో మంచి కలెక్షన్ లు సంపాదిస్తుంది. ఒక్క నైజామ్ లోనే 2.50 కోట్ల షేర్ ను .. సీడెడ్ లో 1.04 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా, రెండు తెలుగు రాష్ట్రాల్లోను కలుపుకుని 6.93 కోట్ల షేర్ ను రాబట్టినట్టుగా సమాచారం.

Untitled Document
Advertisements