అనుష్క మైత్రి మూవీ..!

     Written by : smtv Desk | Sun, Dec 02, 2018, 12:09 PM

అనుష్క మైత్రి మూవీ..!

హైదరాబాద్, డిసెంబర్ 02 : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ స్వీటీ అనుష్క భాగమతి సినిమా తర్వాత గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం కోనా వెంకట్ నిర్మాణంలో సీక్రెట్ సినిమా చేస్తున్న అనుష్క ఆ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి డైరక్షన్ లో సినిమా చేస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే కథా చర్చలు జరిపాయట. ఈ క్రేజీ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కు అనుష్క ఇదవరకు సినిమా చేస్తానని చెప్పిందట. ఆ కారణం చేతనే సినిమా చేస్తుందని అంటున్నారు.

సైజ్ జీరో సినిమాకు లావెక్కిన అనుష్క ఆ సినిమా తర్వాత సినిమాలు చాలా తగ్గించేసింది. బాహుబలి-2, సింగం-3 లో కూడా అనుష్క కాస్త బొద్దుగానే కనిపించింది. భాగమతి సినిమాలో కూడా అక్కడక్క అనుష్క లావుగానే కనిపించింది. అయితే ముందే షూట్ చేసిన సీన్స్ ఉండబట్టి సినిమాలో అనుష్క సైజ్ గురించి మాట్లాడలేదు.

ఇక సీక్రెట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో అనుష్క కోలీవుడ్ హీరో మాధవన్ తో కలిసి నటిస్తుందట. రెండు సినిమా తర్వాత అనుష్క 13 ఏళ్ల తర్వాత వారిద్దరు కలిసి నటిస్తున్నారు.

Untitled Document
Advertisements