అర్జున్ రెడ్డికి ప్రీతీ దొరికేసింది...!

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 11:32 AM

అర్జున్ రెడ్డికి ప్రీతీ దొరికేసింది...!

చెన్నై, ఫిబ్రవరి 16: తెలుగులో యూత్ ని బాగా ఆకట్టుకున్న 'అర్జున్ రెడ్డి' సినిమా విజయ్ దేవరకొండని స్టార్ హీరోని చేసింది. ఇప్పుడు ఈ సినిమాని బాలీవుడ్, కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సాఫీగా ఈ సినిమా షూటింగ్ సాగిపోతుంది.

కానీ కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమాని రీమేక్ నిర్మాతలని ముప్పతిప్పలు పెడుతుంది. ఇటీవల బాల దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సినిమా అవుట్ పుట్ సరిగా రాలేదని భావించిన నిర్మాతలు షూట్ చేసిన సినిమా మొత్తం చెత్త బుట్టలో పారేసి మళ్ళీ రేశూట్ చేయాలనీ నిర్ణయించుకున్నారు.

దీనికోసం హీరో ధృవ్ ని మినహాయించి హీరొయిన్ తో సహా వర్కింగ్ టీం మొత్తాన్ని నిర్మాతలు మార్చేసారు. దర్శకుడు బాల కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా బనితా సంధూ అనే బాలీవుడ్ హీరోయిన్ ని ఫైనల్ చేసారు. ముందుగా ఈ సినిమాలో ధృవ్ కి జోడీగా మేఘ చౌదరి నటించింది.





Untitled Document
Advertisements