ఒపీనియన్ పోల్....ఎగ్జిట్ పోల్.....రిజల్ట్ అంటూ ఐశ్వర్యారాయ్ పై కామెంట్స్

     Written by : smtv Desk | Mon, May 20, 2019, 06:45 PM

ఒపీనియన్ పోల్....ఎగ్జిట్ పోల్.....రిజల్ట్ అంటూ  ఐశ్వర్యారాయ్ పై కామెంట్స్

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత నెటిజన్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను ట్రోల్ చేస్తూ వారు పెట్టే కామెంట్స్ వార్తల్లోకెక్కుతున్నాయి. కొందరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మీమ్స్, పోస్ట్ లు తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు.

అయితే అలాంటి మీమ్స్ ని ఓ సెలబ్రిటీ సపోర్ట్ చేస్తే ఏమవుతుంది..? సరిగ్గా ఐశ్వర్యారాయ్ విషయంలో ఇదే జరిగింది. ఐశ్వర్యారాయ్ ని అవమానిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ ని నటుడు వివేక్ ఒబెరాయ్ తన వాల్ లో పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గతంలో ఐశ్వర్యా.. సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ లతో డేటింగ్ చేసింది. ఆ తరువాత అభిషేక్ ని పెళ్లి చేసుకొంది. దీన్ని ఎలెక్షన్స్ కి లింక్ చేస్తూ ఓ పోస్ట్ తయారు చేశారు. ఐశ్వర్య, సల్మాన్ లని ఉద్దేశిస్తూ ఒపీనియన్ పోల్ అని, ఐశ్వర్య-ఒబెరాయ్ లను ఉద్దేశిస్తూ ఎగ్జిట్ పోల్ అని, ఐశ్వర్య-అభిషేక్ వారి కూతురు ఆరాధ్యలను ఉద్దేశిస్తూ రిజల్ట్ అని రాశారు. ఐశ్వర్యని అవమానించే విధంగా ఉన్న ఈ పోస్ట్ ని 'ఫన్నీ' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు వివేక్.

ఇది చూసిన కొందరు వివేక్ తీరుని తప్పుబడుతున్నారు. ఆడవాళ్లకు గౌరవం ఇవ్వాలంటూ సూచిస్తున్నారు. తెలుగు బాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాలా ఈ ట్వీట్ చూసి వివేక పై అసహనం వ్యక్తం చేసింది. ఐశ్వర్య అభిమానులు ఈ విషయంలో ఆమెకి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు.

Untitled Document
Advertisements