SBI: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా

     Written by : smtv Desk | Wed, May 22, 2019, 12:34 PM

SBI: కార్డు లేకుండానే ఏటీఎం నుంచి మనీ విత్‌డ్రా

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన కస్టమర్ల కోసం అనేక సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కస్టమర్లు తక్షణ నగదు బదిలీ సేవలకు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా, ఎవరికైనా డబ్బుల్ని సులభంగా పంపొచ్చు. కేవలం పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ వివరాలతో డబ్బుల్ని అవతలి వారికి సెండ్ చేయొచ్చు. డబ్బుల్ని సెకన్లలో పంపించడమే కాదు.. అవతలి వ్యక్తి కూడా ఈ డబుల్ని ఏటీఎం నుంచి డెబిట్ కార్డు లేకుండానే విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు రోజుల్లో ఈ డబుల్ని ఏటీఎం నుంచి తీసుకోకపోతే.. ఆ డబ్బులు మళ్లీ సెండర్ అకౌంట్‌కు వెళ్లిపోతాయి. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే.. కిందవైపు కుడి వైపున ఉన్న ఎఫ్‌డీకే‌ను ఉపయోగించాలి. బెనిఫీషియరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెండర్ కోడ్, ఎస్ఎంఎస్ కోడ్, అమౌంట్ వివరాలు కూడా నమోదు చేయాలి. స్కీన్‌పై కన్ఫర్మేషన్ మెసేజ్ కనిపిస్తుంది. యస్ ఎంచుకోవాలి. ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి. తక్షణ నగదు బదిలీ (ఐఎంటీ) సేవల్లో సెండర్ ఎంత డబ్బు పంపిస్తారో.. అంతటినీ ఒకేసారి విత్‌డ్రా చేసుకోవలసి ఉంటుంది.





Untitled Document
Advertisements