'ద ల‌య‌న్ కింగ్‌' కు బ్ర‌హ్మానందం, అలీ డబ్బింగ్

     Written by : smtv Desk | Thu, Jun 20, 2019, 10:28 AM

'ద ల‌య‌న్ కింగ్‌' కు బ్ర‌హ్మానందం, అలీ డబ్బింగ్

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ రూపొందించిన యానిమేటెడ్ చిత్రం 'ద ల‌య‌న్ కింగ్‌' కు మరిన్ని ఆకర్షణలు జోడయ్యాయి. ఈ సినిమాలోని జంతువుల క్యారెక్టర్లకు పలువురు తెలుగు నటీనటులు డబ్బింగ్ చెప్పేందుకు అంగీకరించగా, ఆ జాబితాలో బ్ర‌హ్మానందం, అలీ వచ్చి చేరారు. చిన్నారులకు ఎంతో ఇష్టమైన 'పుంటా' (అడవి పంది)కు బ్రహ్మానందం, 'టిమోన్' (ముంగీస)కు అలీ డబ్బింగ్ చెప్పారు. 'ది జంగిల్ బుక్‌', 'ఐర‌న్ మ్యాన్‌' సినిమాల ద‌ర్శ‌కుడు జాన్ ఫేవ‌రోవ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. సినిమాలోని కీలకమైన ముఫాసా, సింబా అనే సింహాల క్యారెక్టర్లకు ఎవరితో డబ్బింగ్ చెప్పించారో అధికారికంగా వెల్లడించలేదు.

Untitled Document
Advertisements