వాల్‌నట్స్‌తో డయాబెటిస్ ముప్పు దూరం

     Written by : smtv Desk | Wed, Aug 14, 2019, 12:39 PM

వాల్‌నట్స్‌తో డయాబెటిస్ ముప్పు దూరం

భారతీయుల్లో డయాబెటిస్ ముప్పు అధికం. ఈ వ్యాధి బారిన పడినవారు తీపి తినొద్దు, వేళకు తినకున్నా కష్టమే, ఎక్కువ తిన్నా కష్టమే. శరీరంలో ఇన్సులిన్ మోతాదు ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. మధుమేహం బారిన పడ్డ వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. జీవన శైలిలో మార్పుల వల్ల డయాబెటిస్ బారిన పడే ముప్పు ఎక్కువ అవుతోంది. కానీ రోజూ వాల్‌నట్స్‌ను ఆహారంగా తీసుకోవడం డయాబెటిస్ టైప్-2 బారిన పడే ముప్పును సగం వరకు తగ్గించుకోవచ్చని ఓ పరిశోధనలో వెల్లడైంది. రోజూ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాల్‌నట్ తీసుకునే వాళ్లతో పోలిస్తే 3 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినేవాళ్లలో డయాబెటిస్ ముప్పు 47 శాతం తగ్గిందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు గుర్తించారు. రోజుకు 28 గ్రాములు లేదా 4 టేబుల్ స్పూన్ల వాల్‌నట్స్ తినడం వల్ల డయాబెటిస్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వాల్‌నట్స్ తినడం అలవాటు చేసుకోండి.





Untitled Document
Advertisements