వైరల్‌: హెల్మెట్‌ లేదని సైకిల్ ఆపి ఫైన్..!?

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 07:48 AM

ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్‌ వెహికిల్ సవరణ చట్టం సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది... పలు రాష్ట్రాల్లో లారీలు, ట్యాక్సీలు, ఆటోలు, బైక్‌లపై విధించిన చలాన్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇక కొన్ని రాష్ట్రాలు కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని అమలు చేసేలేదని తేల్చిచెప్పాయి.. ఈ జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి.. ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లోనూ కేంద్రం చట్టాన్ని పక్కనబెట్టి.. జరిమానాలను సగానికి తగ్గించేశారు. ఇదంతా ఓవైపు అయితే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సైకిల్‌పై వెళ్తున్న ఓ బాలుడిని పోలీసులు ఆపడం సంచలనమైంది.. సైకిల్‌పై వెళ్తున్న బాలుడిని పోలీసులు ఆపిన దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వదలడంలతో వైరల్‌గా మారిపోయాయి.. హెల్మెట్ లేనందుకు సైకిల్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు పోలీసులు.

ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురిలో జరిగింది.. పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా.. అక్కడి నుంచి ఓ బాలుడు సైకిల్‌పై వెళ్తున్నాడు.. అది గమనించిన పోలీసు.. సైకిల్‌ ఆపి.. ఆ బాలుడితో ఏదో మాట్లాడాడు.. ఆ తర్వాత ఆ సైకిల్‌ను రోడ్డు పక్కకు తీసుకెళ్లి పెట్టారు. దీంతో.. సైకిల్ నడుపుతున్న విద్యార్థికి హెల్మెట్ లేనందున పోలీసులు.. సైకిల్‌ని సీజ్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. పోలీసులు తనిఖీ చేస్తుండగా.. ఎదురుగా ఉన్న ఓ భవనం పైనుంచి ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టి.. హెల్మెట్ లేనందుకు సైకిల్ ఆపి ఫైన్ వేశారని ప్రచారం చేయడంతో వైరల్‌ అయిపోయింది. అయితే, దీనిపై స్పందించిన పోలీసులు.. హెల్మెట్ పెట్టుకోలేదని సైకిల్‌ను సీజ్ చేశారన్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. రెండు చేతులు వదిలేసి ప్రమాదకరమైన రీతిలో ఆ విద్యార్థి సైకిల్ తొక్కడంతో .. సైకిల్ ఆపి ప్రశ్నించినట్టు.. ఆ తర్వాత విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపిచినట్టు చెబుతున్నారు





Untitled Document
Advertisements