పక్షవాతం వచ్చినా నడవచ్చంట!

     Written by : smtv Desk | Sat, Oct 05, 2019, 11:18 AM

పక్షవాతం వచ్చినా నడవచ్చంట!

పక్షవాతం వచ్చిన వారు మళ్ళీ నడవడం అసాధ్యం. ఆ మనిషి మంచానికే పరిమితం అయిపోతారు. ఇవీ ఇప్పటివరకు పక్షవాతంపై ఉన్న ఆలోచనలు. కానీ ఇకపై ఈ లెక్క మారిపోనుంది. పక్షవాతం వచ్చినా కూడా లేచి నిలబడే అవకాశం ఉంది. ఇది ఫ్రాన్స్‌ వాసి విషయంలో నిజమైంది. మన మెదడు నియంత్రించేలా శరీరం బయట అస్తిపంజరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇది సాధ్యమైంది. టెలీప్లెజిక్స్‌ అని పిలిచే ఈ సాంకేతికతకు ఊతమిచ్చినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవనంపై నుంచి కింద పడటంతో వెన్నెముక పూర్తిగా దెబ్బతిని 28 ఏళ్ల థిబాల్ట్‌కు భుజం నుంచి కింది భాగం మొత్తం పక్షవాతం వచ్చింది. దీంతో టెలీప్లెజిక్స్‌ సాంకేతికత సాయంతో అతడికి కొత్త జీవితాన్ని డాక్టర్లు ప్రసాదించారు. దీంతో తిరిగి చక్కగా నడుస్తున్నాడు. ఈ సాంకేతికతలో కంప్యూటర్‌ ద్వారా మెదడు నుంచి సిగ్నల్స్‌.. శరీరం బయట ఉన్న అస్తిపంజరాన్ని నియంత్రిస్తారు. కొన్ని నెలల పాటు ఈ అస్తిపంజరంతో శిక్షణ అందించడంతో ఇప్పుడు చక్కగా నడుస్తున్నాడు. గ్రెనోబెల్‌ అల్పస్‌ ఆస్పత్రి నిపుణుల బృందం, సినాటెక్‌ పరిశోధకులు ఈ విజయం సంధించారు.

Untitled Document
Advertisements