ఏ కోణంలో చూసిన బీర్ అన్నింట్లో బెట్టరే!

     Written by : smtv Desk | Sat, Oct 19, 2019, 09:54 PM

ఏ కోణంలో చూసిన బీర్ అన్నింట్లో బెట్టరే!

బీర్​ తాగితే.. పొట్ట పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అందుకే.. చాలాసార్లు బీర్​ తాగాలని ఉన్నా.. పొట్ట వస్తుందేమో అని భయపడి ఇంకో మార్గం చూసుకుంటారు. లండన్​ యూనివర్సిటీ వాళ్లు చేసిన అధ్యయనంలో బీర్​ తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్​ వస్తుందనేది అబద్ధం అని తేలింది. కొవ్వు పెరగడం, పొట్ట రావడం సంగతి అటుంచితే.. ఇందులోని ఫ్లేవనాయిడ్లు బరువు తగ్గించడానికి తోడ్పడుతాయట. బీరు తాగడం వల్ల వయసు మీద పడిన తర్వాత వచ్చే దృష్టిలోపం సమస్య రాదట. కెనడాలో చేసిన స్టడీలో ఈ విషయం బయటపడింది. ప్రతిరోజూ ఓ గ్లాస్​ బీర్​ తాగితే.. కంటిచూపు మెరుగవుతుందట. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు యాక్టివ్​గా పనిచేస్తాయట.మామూలుగా అయితే ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కోపం వస్తుంది. అయితే.. బీర్​ తాగినప్పుడు ఒత్తిడంతా పోతుందట. ఆ సమయంలో బ్లడ్​ ప్రెషర్​ కూడా అదుపులోకి వస్తుందట. ఇది ఎవరో చెప్పిన ముచ్చట కాదు.. హార్వర్డ్​ యూనివర్సిటీ ప్రొఫెసర్లు హై బీపీతో బాధపడుతున్న కొంతమందికి బీర్​ తాగించి మరీ చేసిన అధ్యయనంలో తేలింది.బీరులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ముందే చెప్పుకొన్నాం కదా! అయితే.. ఆ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్​ కణాలతో పోరాడుతాయట. శరీరంలో క్యాన్సర్​ కణాలను అభివృద్ధి చేసే ఎంజైములతో బీర్​లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫైట్​ చేసి వాటిని నాశనం చేస్తాయట. ఒరెగాన్​ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు చేసిన స్టడీలో ఈ విషయం తేలింది.మనిషి పదికాలాల పాటు చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే గుండె బాగుండాలి. దాని పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా.. అంతే సంగతులు. బ్రిటీష్ మెడికల్​ జర్నల్​ పబ్లిష్​ చేసిన ఓ ఆర్టికల్​లో బీర్​ తాగడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 24.7 శాతం తగ్గుతుందని తేల్చారు. ఇందుకు కారణం ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేయడమేనట.శరీరానికి ఎంత ఫైబర్​ అందితే.. బాడీ అంత దృఢంగా అవుతుంది. జీవక్రియలు అంత సక్రమంగా జరుగుతాయి. ఈ విషయం ఏ డాక్టరును అడిగినా చెప్తారు. అందుకే.. ఫైబర్​ కంటెంట్​ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకొమ్మని సలహా ఇస్తుంటారు. అయితే.. బీర్​లో ఫైబర్​ పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్​ కంటెంట్​ బీర్​లో 20శాతం ఉంటుందంటే నమ్మాల్సిందే..కిడ్నీల్లో రాళ్లతో బాధపడేవారికి డాక్టర్లు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగమని చెప్తారు. దొరికితే కలుషితం కాని స్వచ్ఛమైన కల్లు తాగమని చెప్తారు. కల్లు దొరికితే ఓకే. కానీ.. పట్నంలో ఉండేవారికి కల్లెక్కడ దొరుకుతుంది? అందుకే చాలామంది డాక్టర్లు కిడ్నీల్లో రాళ్లతో బాధపడే వారికి అప్పుడప్పుడు ఓ బీర్​ వేయమని సలహా ఇస్తారు. ఎందుకంటే బీర్​లో రాళ్లు కరిగించే గుణాలున్నాయి. పొటాషియం, మెగ్నీషియం బీరులో పుష్కలంగా ఉండి, కిడ్నీలో రాళ్లు కరిగించడానికి సహాయపడతాయి.‘ఆరోగ్యంగా ఉండండి.. రన్​ అవుట్​ కాకండి’ అంటూ సిగరెట్​ యాడ్​లో రాహుల్​ ద్రావిడ్​ చెప్పే మాటలు గుర్తున్నాయా? బీ– విటమిన్​ తక్కువై ఆరోగ్యం విషయంలో కూడా రన్​ అవుట్​ కావొద్దంటే రోజుకో గ్లాసు బీర్​ తాగమని చెప్తున్నారు పరిశోధకులు. బీర్​లో బి–విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కణాల ఆరోగ్యాన్ని బి– విటమిన్లు పెంచుతాయి.ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అందానికి కూడా బీర్​ చాలా ఉపయోగపడుతుంది. వెంట్రుకల ఆరోగ్యం కోసం, పటుత్వం కోసం రకరకాల షాంపూలు, నూనెలు, ప్యాక్​లు వాడి అలసిపోయారా? అయితే.. ఈ సారి బీర్​తో మీ జుట్టు కడిగిచూడండి. తేడా మీరే గమనిస్తారు. ఆల్రెడీ మార్కెట్లో బీర్​ షాంపూలు దొరుకుతున్నాయి కదా!





Untitled Document
Advertisements