కాంగ్రెస్ జాతిని నాశనం చేస్తోంది: మోడీ

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 09:41 PM

కాంగ్రెస్ జాతిని నాశనం చేస్తోంది: మోడీ

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ జాతిని నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు. హర్యానా ఎన్నికలకు చివరి రోజు ప్రచారం చేస్తూ ఆయన శనివారం కాంగ్రెస్ పార్టీపై దాడిని ఉధృతం చేశారు. ఆర్టికల్ 370, కర్తార్‌పూర్ కారిడార్ వంటి అంశాలపై మాట్లాడుతూ మోడీ తప్పుడు విధానాలు, వ్యూ హాలతో ప్రతిపక్ష కాంగ్రెస్ జాతిని నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు. ఇక్కడ ఒక ర్యాలీలో మాట్లాడుతూ ప్రధాని రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 370 కింద జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించడమనేది తాత్కాలిక అంశమేనని, అయితే 70 ఏళ్లపాటు అది కొనసాగినా కాంగ్రెస్ ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇప్పుడు దేశ ప్రజలు, కశ్మీరీలు విధానాల్ని రూపొందించుకుంటాయని చెబుతూ ‘దేశం మారింది, కాలం మారింది’ అన్నారు. ‘ఢిల్లీలో అధికారంకోసం కశ్మీర్ నాశనం కావాలా? కశ్మీర్ ముఖ్యమా? లేక ప్రధాని పదవి ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించారు. దీనికి జవాబేమిటంటే …ప్రధానులు వస్తుంటారు, వెడుతుంటారు. కానీ కశ్మీర్ ఎప్పటికీ ఉంటుంది.వర్థిల్లుతుంది. అక్కడ అమాయకులు చనిపోతున్నారే తప్ప, సమస్య పరిష్కారానికి 70 ఏళ్లుగా చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నమేం లేదు’ అని ప్రధాని మోడీ ఆరోపించారు. కర్తార్‌పూర్ కారిడార్ గురించి ప్రస్తావిస్తూ …‘ఇది పూర్తి కావచ్చింది. సిక్కు మత ప్రవక్త 550వ జయంత్యుత్సవాన్ని చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దేశ విభజన సమయంలో కర్తార్‌పూర్ గురుద్వారాను భారతదేశ పరిధిలోచేర్చకపోవడం పెద్ద తప్పు. మత గురువు నుంచి భక్తులు విడిపోకుండా కాంగ్రెస్ కానీ, సిక్కు సంస్కృతికి చెందిన పార్టీలు కానీ ఏ ప్రయత్నమూ చేయలేదు’ అని మోడీ విమర్శించారు.





Untitled Document
Advertisements