ఆయన చేసినంత ఎవరూ చేయలేదు!

     Written by : smtv Desk | Sun, Oct 20, 2019, 11:02 PM

ఆయన చేసినంత ఎవరూ చేయలేదు!

రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం భారతీయుడు-2లో నటిస్తోన్నసంగతి తెలిసిందే. శంకర్ -కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇటీవలే రకుల్ జాతీయ మీడియాతో చిట్ చాట్ లో పలు విషయాలు షేర్ చేసుకుంది. కమల్ హాసన్ భారత సినీ పరిశ్రమలో ఉన్న నటుల్లో ఉత్తమనటుడని చెప్పింది. నాకు తెలిసినంత వరకు సినిమాల్లో కమల్ హాసన్ పోషించిన పాత్రలు ఎవరూ చేయలేదు. అలాంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. శంకర్-కమల్ క్రేజీ కలయికలో మరోసారి వస్తోన్న భారతీయుడు-2లో నటించడం చాలా హ్యాపీగా ఉందని పేర్కొంది.





Untitled Document
Advertisements