‘వన్ నైట్ స్టాండ్’ అంటే ఏమిటీ?

     Written by : smtv Desk | Wed, Oct 23, 2019, 12:09 AM

‘వన్ నైట్ స్టాండ్’ అంటే ఏమిటీ?

ఈ మధ్య కాలంలో ‘వన్ నైట్ స్టాండ్’ అనె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఈ ‘వన్ నైట్ స్టాండ్’అంటే ఏంటీ....? ప్రియురాలు లేదా ప్రియుడు, స్నేహితులు, బంధువులతో సెక్స్ సాధారణమే. కానీ, మీరు సింగిల్‌గా ఉంటూ పరిచయం లేని అమ్మాయి లేదా అబ్బాయితో ఒక రాత్రి గడిపి, వారితో మళ్లీ ఎలాంటి సంబంధాలు కొనసాగించకపోవడాన్ని ‘వన్ నైట్ స్టాండ్’ అంటారు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకే పరిమితమైన ఈ ట్రెండ్.. ఇప్పుడు ఇండియాకు కూడా పాకింది. నగర జీవితంలో ఇది భాగమైపోయింది. సింగిల్‌గా ఉండేవారు ఒక్కసారైనా సెక్స్ అనుభూతి పొందాలని భావిస్తారు. వీరిలో చాలామంది తమతో సెక్స్ చేసే వ్యక్తి ఎలాంటి పరిచయం లేనివారై ఉండాలని భావిస్తారు. అలాగే, సెక్స్ తర్వాత వారితో ఎలాంటి సంబంధం కొనసాగించకూడదని కోరుకుంటారు. భవిష్యత్తులో తమ వైవాహిక జీవితం, ఫ్యామిలీ లైఫ్‌కు భంగం కలగకుండా జాగ్రత్తపడతారు. అయితే, ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఆయా వ్యక్తుల అభిరుచిపై కూడా ఆధారపడి ఉంటుంది. ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఒకరి కోరిక మాత్రమే కాదు, ఇరువురికి ఇష్టమైతేనే సాధ్యమవుతుంది.సెక్స్ కోరిక తీర్చుకోవాలంటే వేశ్యల వద్దకు వెళ్లొచ్చు కదా అని చాలామంది భావిస్తారు. అయితే, అది డబ్బులిచ్చి పరిమిత సమయంలో పొందే సుఖం. కానీ, ‘వన్ నైట్ స్టాండ్’ అనేది ఇరువురి ఇష్టంతో జరిగే ప్రక్రియ. ఇందుకు ఏకాంత ప్రాంతాలు దొరికితే చాలు.. డబ్బు ఖర్చు చేయక్కర్లేదు. పైగా, సెక్స్ కోరుకునే అమ్మాయిలకు అది సాధ్యం కాదు. దీంతో ఎవరైతే ఆమెలాగే సెక్స్ కోరుకుంటారో అలాంటి వ్యక్తి కోసం ఎదురుచూస్తారు.‘వన్ నైట్ స్టాండ్’ అంటే.. ఒక రాత్రికే కట్టుబడి ఉండటం. అయితే, చాలామంది ఈ రూల్‌ను పాటించరు. తనతో సెక్స్ చేసే పార్టనర్ నచ్చితే ఏళ్ల తరబడి సంబంధం కొనసాగిస్తారు. ఇది భవిష్యత్తులో ఇబ్బందులను కూడా తెచ్చి పెడుతుంది. ఎందుకంటే.. ‘వన్ నైట్ స్టాండ్’లో లభించే భాగస్వామి.. అతడు లేదా ఆమెను మనస్ఫూర్తిగా నమ్మే అవకాశం ఉండదు. ఒకరినొకరు సెక్స్ కొరుకుని వచ్చే వ్యక్తులే కావడం వల్ల వారి మధ్య ఆరోగ్యకరమైన బంధం ఉండదు. అలాగే దీనివల్ల అనేక ఇబ్బందులు, లేనిపోనీ తలనొప్పులు ఎదురయ్యే అవకశాలు అతిగా ఉన్నాయని, వీటికి అలవాటు పడితే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటువంటి కార్యకలాపాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు.





Untitled Document
Advertisements