మంచి ఆఫర్ ను వదులుకున్న రష్మిక

     Written by : smtv Desk | Sun, Dec 08, 2019, 04:53 PM

కన్నడ భామ రష్మిక మందన్న తానో పాత్ర చేయలేనని చెప్పి సినిమా ఒప్పుకోకపోవడం ఊహించి ఉండరు. కాని అది జరిగింది. ఇంతకీ ఏ సినిమాను రష్మిక కాదని చెప్పింది అంటే.. జెర్సీ బాలీవుడ్ రీమేక్ ను చేయలేనని చెప్పిందట. నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా జెర్సీ.

మంచి కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాతో నాని మరోసారి తన సత్తా చాటాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్. తన సహజమైన నటనతో ఆకట్టుకున్న శ్రద్ధ శ్రీనాథ్ ఆ సినిమాతో మంచి మార్కులు సాధించింది. అయితే జెర్సీ రీమేక్ లో రష్మికను అడిగినా తను శ్రద్ధ శ్రీనాథ్ లా చేయలేనని చెప్పి సినిమాను వదులుకుందట.

జెర్సీ హిందీ రీమేక్ లో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. రష్మిక వద్దనేసిన ఆ ఆఫర్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. మరి రష్మిక చేయలేనని చెప్పిన ఆ పాత్రలో మృణాల్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.





Untitled Document
Advertisements