గజ్వేల్ లో నేడు సిఎం కెసిఆర్ విశేష పర్యటన

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 06:07 AM

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిఎం కెసిఆర్ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా గజ్వేల్‌లో ఫారెస్ట్ కళాశాల, ఉద్యానవన యూనివర్సిటీ, ఐఒసి, దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహాతి ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులకు సిఎం కెసిఆర్ ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విదంగా రూ. 100 కోట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 100 పడకల మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రితో పాటు మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా మంత్రి హరీశ్ రావు,కలెక్టర్ వెంకట్రామిరెడ్డిలు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.కాగా సిఎం పర్యటన పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు, అధికార వర్గం ఎక్కడా అలసత్వం వహించొద్దని, ఏమరపాటుకు తావివ్వకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మహతి ఆడిటోరియంలో పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ఇతరులతో సిఎం ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అలాగే గేట్ వద్ద పాసులు ఉన్న వారినే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం విక్రయదారులకు ప్రత్యేక పాసులు ఇచ్చి వారికి కేటాయించిన కౌంటర్లలో ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.మహాతి ఆడిటోరియంలో కళాప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో కళాకారులకు సైతం ప్రత్యేక పాసులు జారీ చేశామన్నారు. సిఎం పాల్గొనే కార్యక్రమాల వద్ద విద్యుత్తు శాఖ డిఇలు అక్కడే ఉండి విద్యుత్తు సరఫరా అంతరాయం కలుగకుండా చూడాలని మంత్రి సూచించారు. గజ్వేల్ పట్టణంతో పాటు ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పరిశుభ్రత, నీటి సదుపాయం, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.గజ్వేలే నియోజకవర్గం అనేక అద్భుత కార్యక్రమాలకు వేదికకానుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. తాగునీటి కటకటను సిఎం ఏడాదిలో తీర్చారన్నారు. గతంలో తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఉండేదని, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని కుళాయి ద్వారా అందించామన్నారు. గజ్వేల్‌లోని అన్ని గ్రామాలలో అద్భుత అభివృద్ది జరిగిందన్నారు. హర్టికల్చర్ యూనివర్సిటీ, అటవీ కళాశాలతో విద్యావ్యవస్థ విద్యార్థులకు చేరువ అవుతుందన్నరు. విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా ఓ ఇంజనీరుగా ఆలోచించి కెసిఆర్ సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారన్నారు. సకల సౌకర్యాలతో ఏర్పాటై అందుబాటులోకి మార్కెట్ వచ్చిందన్నారు. గజ్వేల్ రెవిన్యూ డివిజన్ కు చెందిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా సమీకృత భవన కార్యాలయ సముదాయాన్ని కూడా నిర్మించామన్నారు. 1200సీట్ల సామర్థ్యంతో మహతి ఆడిటోరియం నిర్మాణం పూర్తి అయిందని వివరించారు. అలాగే రూ.100 కోట్లతో గజ్వేల్, -ప్రజ్ఞాపూర్ మునిసిపాలిటీ పరిధిలో భూగర్భ మురికికాలువ నిర్మాణానికి శంకుస్థాపన, రూ.32 కోట్లతో 100 పడకల మాతా, శిశు ఆసుపత్రి నిర్మాణ పనులకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేస్తారన్నారు. మహతి డిటోరియంలో నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించిన అనంనతరం సిఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి అధికారులు, సీనియర్ నాయకులతో భోజనం చేస్తారని తెలిపారు.





Untitled Document
Advertisements