కదులుతున్న కారులో యువకుడిపై గ్యాంగ్ రేప్

     Written by : smtv Desk | Wed, Dec 11, 2019, 05:01 PM

కదులుతున్న కారులో యువకుడిపై  గ్యాంగ్ రేప్

ముంబయిలో 22 ఏళ్ల యువకుడిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘోర ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబై సెంట్రల్ సబర్బన్‌లో నివసించే ఓ యువకుడు(22).. ఆదివారం(డిసెంబర్ 9) ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతడి ఫాలోవర్స్‌లో ఉన్న నలుగురు వ్యక్తులు దాన్ని చూసి చూసి అడ్రస్ ట్రేస్ చేసి అతడిని కలుసుకున్నారు.ఇన్‌స్టాగ్రామ్‌లో మిమ్మల్ని చాలారోజులుగా ఫాలో అవుతున్నామని, మీకు అభిమానులమని చెబుతూ ఆ యువకుడిని మాటల్లోకి దించారు. మీతో కాసేపు గడపాలని ఉందని వారు కోరడంతో అతడు సరేనన్నాడు. రెస్టారెంట్ సమీపంలోనే వారంతా కాసేపు కలియతిరిగిన తర్వాత ఆ యువకుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.కదులుతున్న కారులోనే యువకుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. కాసేపటికి తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు వెంటనే వీబీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌ తరలించారు.






Untitled Document
Advertisements