బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్ స్పోర్ట్స్ బైక్ లాంచ్

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 06:00 PM

బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్ స్పోర్ట్స్ బైక్ లాంచ్

స్పోర్ట్స్ మోటార్ సైకిళ్లు అంటే వాహన ప్రియుల్లో పిచ్చ క్రేజ్. ముఖ్యంగా బ్రాండెడ్ సంస్థల నుంచి బైక్స్ విడుదలవుతున్నాయంటే ఈ క్రేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. తాజాగా ప్రముఖ వాహన సంస్థ బీఎండబ్ల్యూ భారత మార్కెట్లో సరికొత్త మోటార్ సైకిల్ ను విడుదల చేసింది. అదే బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూజర్. ఎక్స్ షోరూంలో దీని ప్రారంభ ధర వచ్చేసి రూ.18.90 లక్షలు. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ వాహనం వేరియంట్ల వారీగా ధరలో వ్యత్యాసముంది. దీని ధర వచ్చేసి రూ. 21.90 లక్షలు.

బీఎండబ్ల్యూ ఆర్18 మోటార్ సైకిల్ హెరిటేజ్ సిరీస్, ట్రెడిషనల్ క్రూజర్ స్టైలింగ్ తో అందుబాటులోకి వచ్చింది. ట్రెడిషనల్ డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ ఫీచర్లతో ఈ మోటార్ సైకిల్ అందుబాటులోకి వచ్చింది. టేర్ డ్రాప్ షేప్డ్ ఫ్యూయల్ ట్యాంకు, మిడ్ మౌంటెడ్ ఫుట్ పేజీలు, ఎక్స్ పోజ్డ్ డ్రైవ్ షాఫ్టులు పెయింట్ వర్క్ విత్ డబుల్ పిన్ స్ట్రిపింగ్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
2020 బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్

ట్రెడిషనల్ డిజైన్ లుకింత్ పాటు అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ వాహనాల్లో ఎల్ఈడీ హెడ్ ల్యాంపులు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ (డే టైమ్ రన్నింగ్ లైట్లు), ఎల్ఈడీ టెయిల్ లైట్లు, సర్కూలర్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ డిస్ ప్లే స్క్రీన్ ఉంది.

బీఎండబ్ల్యూ ఆర్ 18 ఫస్ట్ ఎడిషన్ మోటార్ సైకిల్లో అదనపు ఫీచర్లు, ఎక్విప్మెంట్ ను కలిగి ఉంది. అడాప్టీవ్ హెడ్ లైట్లు, ఫస్ట్ ఎడిషన్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ కూడా సైడ్ ను ఉంది. సీటు బ్యాడ్జ్ తో లైఫ్ స్టైల్ యాక్ససరీస్ కలెక్టేబుల్స్ బ్లాక్ స్ట్రోమ్ మెటాలిక్ పెయింట్ స్కీముతో అందుబాటులోకి వచ్చింది.

బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్ వాహనం 1802 సీసీ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ రెండు సిలీండర్ల ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 4570 ఆర్పీఎం వద్ద 91 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 3000 ఆర్పీఎం వద్ద 158 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 6-స్పీడ్ ట్రాన్స్ మిషన్ యూనిట్ ను కలిగి ఉంది. బీఎండబ్ల్యూ ఆర్ 18 ముందు భాగంలో సస్పెన్షన్ సెటప్ టెలిస్కోపిక్ ఫోర్కులు ఉన్నాయి. అంతేకాకుండా ట్విన్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. ఏబీఎస్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ ఇందులో ఉన్నాయి.

ఇవి కాకుండా ఈ మోటార్ సైకిల్లో రెయిన్, రోల్, రాక్ లాంటి రైడింగ్ మోడ్స్ లో ప్రయాణించగలవు. బీఎండబ్ల్యూ ఆర్ 18 క్రూజర్ ఆటోమేటిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్, హిల్ స్టార్ట్ కంట్రోల్, కీలెస్ రైడ్ సిస్టం ప్రత్యేకతలు ఉన్నాయి. భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ఆర్18 క్రూజర్ కు పోటీగా ట్రైంఫ్ రాకెట్ 3 ఉంది.





Untitled Document
Advertisements