ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు: రెండో స్థానంలో భారత్

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:17 PM

ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు:  రెండో స్థానంలో భారత్

దేశంలో కరోనా వైరస్ కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడచిన 15 రోజుల్లోనే దేశంలో కరోనా వైరస్ కేసులు 18 శాతం మేర తగ్గగా.. మరణాలు 19 శాతం తగ్గాయి. అక్టోబరు నెల తొలి పదిహేను రోజుల్లోనే 10,55,068 కేసులు నమోదయ్యాయి. ఆగస్టు రెండో వారం తర్వాత కొత్త కేసులు ఇంత తక్కువ సంఖ్యలో నమోదుకావడం ఇదే తొలిసారి. సెప్టెంబరు నెలతో పోల్చితే ఇది 18.4 శాతం తక్కువ. వరుసగా రెండో పక్షంలో కేసులు తగ్గడం గమనార్హం. సెప్టెంబరు 16-30 మధ్య పదిహేను రోజులతో పోల్చితే గత 15 రోజుల్లో కేసులు 2.9 శాతం తక్కువగా నిర్ధారణ అయ్యాయి. దేశంలో కరోనా మరణాలు సంఖ్య కూడా తగ్గడం సానుకూలంశం. అక్టోబరు నెల తొలి 15 రోజుల్లో మొత్తం 13,474 మంది ప్రాణాలు కోల్పోగా.. అంతకు ముందు పక్షం రోజులతో పోల్చితే ఇది 18.9 శాతం తక్కువ. సెప్టెంబరు రెండో పక్షంలో తొలిసారి తగ్గుముఖం పట్టిన మరణాలు తిరిగి కొనసాగుతున్నాయి. సెప్టెంబరు తొలినాళ్లలో కోవిడ్ మరణాలు భారీ సంఖ్యలో చోటుచేసుకున్నాయి. అదే నెల తొలి రెండు వారాల్లో 13,31,660 కొత్త కేసులు, 16,641 మరణాలు నమోదయ్యాయి. ఆగస్టు చివరి పక్షంతో పోల్చితే ఇది 15.4 శాతం అధికం. అక్టోబరు తొలి పక్షంలో 10 లక్షలకుపైగా కేసులు, 13వేలకుపైగా మరణాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం నాటికి యాక్టివ్ కేసులు 8 లక్షలుగా ఉన్నాయి. ఆగస్టు 31 తర్వాత ఇంత తక్కువకు చేరడం ఇదే తొలిసారి. శుక్రవారం దేశవ్యాప్తంగా 62,587 కేసులు నమోదు కాగా.. 871 మంది కోవిడ్-19కు బలయ్యారు. బెంగాల్‌లో వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. మొత్తం 3,771 కేసులు.. 61 మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో మరో 11,447 మందికి వైరస్ నిర్దారణ కాగా.. 306 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు మరో 4,389 కేసులు బయటపడగా.. 57 మంది చనిపోయారు. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసులు 6,79,191కి చేరుకోగా.. మరణాలు 10,529కి చేరాయి. ప్రస్తుతం తమిళనాడులో కేవలం 40 వేల యాక్టివ్ కేసులున్నాయి. ఒడిశాలోనూ కేసు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 2,138 కేసులు నమోదుకాగా.. గత రెండు నెలలతో పోల్చితే ఇదే అత్యల్పం.





Untitled Document
Advertisements