సామాన్యులకు షాక్, భారీగా పెరగనున్న ఉల్లి ధర

     Written by : smtv Desk | Wed, Oct 21, 2020, 10:45 AM

సామాన్యులకు షాక్, భారీగా పెరగనున్న ఉల్లి ధర

నెల రోజుల కిందట రూ.100కు ఏకంగా 5 కేజీల ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ ఇప్పుడు కేజీ ఉల్లిగడ్డలు కొనాలంటే రూ.50-80 వరకు చెల్లించాలి. అంటే నెల రోజుల వ్యవధిలోనే ధర భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు.

అయితే ఇప్పుడు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. ఉల్లి గడ్డల ధర ఇంకా భారీగా పెరిగే అవకాశముంది వ్యాపారులు పేర్కొంటున్నారు. పండుగ నాటికి ఉల్లి ధర కొండెక్కి కూర్చొనుందని తెలిపారు. ఉల్లి ధరలు ఇలానే పెరుగుతూ వెలితే దీపావళి పండుగ నాటికి కేజీ ఉల్లి గడ్డల ధర రూ.100కు చేరొచ్చని అంచనా వేస్తున్నారు.

ఉల్లి గడ్డల ధర భారీ స్థాయిలో పెరగొచ్చనే అంచనాలకు ఒక ప్రధాన కారణం ఉంది. అకాల వర్షాల కారణంగా ఉల్లి గడ్డల ధర భారీగా పెరగనుంది. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి పంట దెబ్బతింటోంది. దేశంలోనే అతిపెద్ద ఉల్లి గడ్డల మార్కెట్ లాసాల్‌గాన్ (నాసిక్ దగ్గరిలో)లో ఇప్పుడు ఉల్లి ధర క్వింటాల్‌కు దాదాపు రూ.7,000 సమీపంలో ఉంది.

ట్రేడర్లు ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఉల్లి గడ్డల ధర కేజీకి ఏకంగా రూ.100కు చేరే ఛాన్స్ ఉందనంటున్నారు. మహరాష్ట్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో అక్కడే ఉల్లి పంట దెబ్బతింది. కేవలం మహరాష్ట్రలో మాత్రమే కాకుండా కర్నాటక, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లి గడ్డల ధర పెరుగుతోంది.

మరి కొంత మంది ట్రైడర్లు ఉల్లి గడ్డల ధర 2020 ఫిబ్రవరి వరకు దిగివచ్చే అవకాశం లేదంటున్నారు. వర్షాల కారణగా పంట దెబ్బ తినడంతోపాటు హోటల్స్, డాబాలు తెరుచుకోవడంతో ఉల్లి గడ్డలకు డిమాండ్ నెలకొంది. దీంతో ఉల్లి గడ్డల ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.

Untitled Document
Advertisements