సర్జరీ లేకుండా ఊపిరితిత్తుల్లో నుంచి ఎల్ఈడీ బల్బు తీసిన డాక్టర్లు

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:00 PM

సర్జరీ లేకుండా ఊపిరితిత్తుల్లో నుంచి ఎల్ఈడీ బల్బు తీసిన డాక్టర్లు

ఓ బాలుడు ఎల్‌ఈడీ బల్బును మింగేశాడు. దీంతో బాలుడికి శ్వాస సమస్యలు, దగ్గుతో అల్లాడిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి ఎల్‌ఈడీ బల్బు మింగాడని నిర్ధారించుకున్న డాక్టర్లు.. ఎలాంటి సర్జరీ లేకుండానే.. ఆ బల్బును బయటకు తీశారు. హైదరాబాద్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. వివరాాల్లోకి వెళ్తే మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రకాశ్ వయసు తొమ్మిదేళ్లు. తోటి పిల్లలతో ఆడుకుంటూ ప్రకాశ్ ఆదివారం ఎల్‌ఈడీ బల్బును మింగేశాడు.
స్నేహితులతో ఆడుకుంటున్న సమయంలో చిన్న బల్బును నోట్లో పెట్టుకున్నాడు ప్రకాశ్. అయితే తనకు తెలియకుండానే ఆడుకుంటూ..ఆడుకుంటూ.. బల్బును దాన్ని మింగేశాడు. బయటకు తీసేందుకు ఎంతో ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. దీంతో అతడ్ని వెంటనే తల్లిదండ్రులు హైదరాబాద్‌ తరలించారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్నారికి స్కానింగ్ తీస్తే బాడీలో ఎల్‌ఈడీ బల్బు ఉన్నట్లు గుర్తించారు. శ్వాసనాళంలో ఊపిరితిత్తుల సమీపంలో ఆ చిన్న బల్బు చిక్కుకుపోయింది. అందుకనే అతడు శ్వాస తీసుకోలేక ఇబ్బందులు పడినట్లు.. దగ్గుతో ఆయాసపడినట్లు డాక్టర్లు గుర్తించారు.

వెంటనే డాక్టర్లు బాలుడికి పీడియాట్రిక్ రిజడ్ బ్రాంకోస్కోపి చేసి ఎల్‌ఈడీ బల్బును బయటకు తీశారు. కేవలం 10 నిమిషాల్లోనూ ఈ పని పూర్తి చేశారు. అనంతరం అదే రోజు బాలుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. తమ చిన్నారి ప్రాణాలు కాపడిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.





Untitled Document
Advertisements