పాదాలపై ఒత్తిడిని కలిగించే " రిఫ్లేక్సాలజీ " ట్రీట్మెంట్ తో ఆరోగ్యం మీసొంతం

     Written by : smtv Desk | Fri, Apr 16, 2021, 12:56 PM

పాదాలపై ఒత్తిడిని కలిగించే

మన శరీరం బరువు మొత్తం మన పాదాల మీదే పడుతుంది.పొద్దుటి నుండి రాత్రి పడుకోబోయేదాకా పాదాలు పనిచేస్తూనే ఉంటాయి. ప్రొద్దున్న సాయంత్రం ఓ అరగంట సేపు నడవడం ఆరోగ్యానికి మంచిది. సాధారణంగా మనం నడిచే చోట నీరు ఉన్నట్టు అయితే ఆ మురికి నీళ్ళలో పాదాలు నానుతుంటాయి. కాలివేళ్ల మధ్య మురికి చేరుతుంటుంది. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కుని పాదాలను పొడిగా ఉంచుకోవడం ఆరోగ్యకరం. ఉదయం, సాయంత్రం చెప్పులు లేకుండా పచ్చి గడ్డిపై నడవడం మీ పాదాల ఆరోగ్యానికి మంచిది. మర్రిచెట్టు పాలు కూడా కాళ్ళ పగుల్లకు చక్కని ఔషధం. ఈ పాలను పగుళ్ళ భాగానికి క్రమం తప్పకుండా ప్రతిరోజు రాస్తుంటే, వారం తిరక్కుండానే కోమలమైన పాదాలు మీ స్వంతం అవుతాయి.
అతిగా నడవడం వల్ల, సరైన విశ్రాంతి లేకా పాదాలు అనారోగ్యానికి గురి అవుతాయి.అప్పుడు కొన్ని ప్రదేశాల్లో వత్తిడి కలిగించి, అనారోగ్యాన్ని పోగోట్టవచ్చును. ఈ వైద్య విధానాన్ని " రిఫ్లేక్సాలజీ " అని అంటారు. ఇది పాదాల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుపుతాయి. ఇది అతి పురాతనమైన వైద్య విధానం. పాదాలలో వచ్చే జబ్బుల వల్ల శరీరంలోని ఇతర అవయవాలు అనారోగ్యం పాలవుతాయి అంటుందీ శాస్త్రం.
కాలి పాదాలను అణువణువూ తాకి, పరీక్షించి కొన్ని ప్రదేశాల్లో గట్టిగా ఉండటాన్ని బట్టి ఏయే అవయవాలు ఎటువంటి అనారోగ్యంతో భాదపడుతున్నది తేలిగ్గా తెలుసుకుంటారు. రిఫ్లేక్సాలజిస్ట్ పాదాలను తడిమి అనారోగ్యాన్ని గుర్తించగలుగుతాడు. గట్టిగా, పలుకుల్లా తగిలిన ప్రదేశాల మీద వైద్యడు చేతితో నొక్కుతున్నప్పుడు, రోగికి ఆ ప్రదేశంలో, ఆ ప్రదేశానికి సంబంధించిన శరీరంలోని ఇతర భాగాలలోనో, ఒక్కొక్కసారి రెండు ప్రదేశాలలోనూ నొప్పి పుడుతుంది. నెమ్మదిగా పదం మీదికి తాకినా కూడా, రిఫ్లెక్స్ పాయింట్ దగ్గర చాలా నొప్పి పుడుతుంది. అంటే, ఆ ప్రదేశంలో సెన్సిటివ్ నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది.
క్లాక్వైజ్ డైరేక్షన్లలో బొటన వేలితో పాదాలలోని గట్టి ప్రదేశాల్లో రాస్తు వైద్యం చేస్తారు. బొటన వేలిని గట్టిగా నొక్కిపట్టి రాయాలి. ఇలా అనారోగ్యం తొలగిపోయేంత వరకూ ఒక సెషన్లో 10-౩0 నిమిషాల వరకూ ట్రీట్మెంట్ ఇస్తారు. ఇలా చేస్తున్నప్పుడు ఎంతో భాదకల్గినా అనారోగ్యం పూర్తిగా దానంతట అదే తొలగిపోతుంది.
ఈ వైద్యం చేయడానికి పాదాల మీద ఏఏ ప్రదేశాలు ఏఏ శరీర భాగాలకి చెందినవో తెలుసుకోవడం చాల అవసరం. మైగ్రేన్, సైనస్, ఆస్తమా, మలబద్దకం, గాల్ స్టోన్స్ నివారనకే రిఫ్లేకోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది.
రిఫ్లేక్సాలజీ ప్రకారం మన శరీరంలోని అన్ని అవయవాలకీ, పాదాలతో సన్నిహిత సంబంధం ఉంది. పాయింట్లన్నీ పాదాల ప్రక్కన, పైన ఉన్నాయి. నొప్పిని బట్టి పాయింట్లలో గట్టిగా వేలితో నిక్కి చికిత్స చేసుకోవచ్చు. ఆయా భాగాల నరాలు శరీరంలోని, ఆయ ప్రదేశాల వరకు వ్యాపించి ఉండడమే దీనికి కారణం.
అతిపురాతనమైన ఈ వైద్య విధానం చైనా, ఇండియా దేశాల్లో ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. నేడు కేరళలోని స్పాలలో ఇంచుమించు ఎదే ప్రక్రియను చేపడుతున్నారు.





Untitled Document
Advertisements