రాజ్ కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు

     Written by : smtv Desk | Wed, Jul 28, 2021, 05:15 PM

రాజ్ కుంద్రాకు బిగుస్తున్న ఉచ్చు

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ఉచ్చు బిగుస్తున్నట్టే కనిపిస్తోంది. పోర్నోగ్రఫీ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నీలి చిత్రాలను యాప్ లలో అప్ లోడ్ చేశారనే అభియోగాలను ఆయన ఎదుర్కొంటున్నారు. పలువురిని మోసం చేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

మరోవైపు రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది. ఆయనతో పాటు ఆయన సహచరుడు ర్యాన్ థోర్పే బెయిల్ పిటిషన్ ను కూడా నిరాకరించింది. రాజ్ కుంద్రా కస్టడీని నిన్ననే మరో రెండు వారాల పాటు కోర్టు పొడిగించింది. ఆయన కస్టడీని కోర్టు పొడిగించడం ఈ వారంలో ఇది మూడోసారి. రాజ్ కుంద్రా ఈ నెల 19న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements