కబడ్డీ ఆటతో కలిసిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు..

     Written by : smtv Desk | Wed, Nov 09, 2022, 02:45 PM

కబడ్డీ ఆటతో కలిసిపోయి ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు మహిళలు..

లింగమార్పిడి అనగా జన్మతహ వచ్చిన లింగమును శస్త్ర చికిత్స ద్వారా మార్పు చేసుకోవడము. అనగా జన్మతహ స్త్రీ, పురుషునిగానూ అలాగే పురుషుడు స్త్రీ గానూ మారిపోవడము. కొన్ని జంతువులలో ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ మానవులకు మాత్రం ప్రకృతి ఈ సౌలభ్యాన్ని ప్రసాదించలేదు. దీనికి శస్త్ర చికిత్స ఒక్కటే మార్గము..అయితే ప్రేమ ఎంత పని చెయ్యడానికి అయిన వెనుకాడడు..ప్రేమలో ప్రే అంటే ప్రేమించటం, మ అంటే మరిచిపోవటం. దౌర్భాగ్య విఫణి వీధిలో నేడు ప్రేమ కూడా ఒక వర్తకపు వస్తువే. ఆత్మవంచనకు మనం అందంగా పెట్టుకున్న పేరే ప్రేమ.. ప్రేమకు కళ్లు లేవు గుడ్డిది అంటారు. అయితే కళ్లు మాత్రమే కాదు వయసుతో కూడా సంబంధం లేదు. అయితే అదో విచిత్రమైన ప్రేమజంట. వాళ్లద్దరూ అమ్మాయిలే. అయినా ప్రేమించుకున్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కబడ్డీ ఆట ఆజ్యం పోసింది. రాజస్థాన్‌ భరత్‌పూర్‌ జిల్లాలోని నాగ్లా లోని ప్రభుత్వ పాఠశాలలో స్టోర్ట్స్ టీచర్‌గా పనిచేస్తోంది మీరా . అదే స్కూల్‌లో చదువుకుంటున్న కల్పనా ఫౌజ్దార్ అనే విద్యార్ధిని స్పోర్ట్స్‌లో చాలా చురుకుగా ఉండేది. ముఖ్యంగా కబడ్డీ ఆట లో కల్పన రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారిణి. దుబాయ్ లో జనవరిలో జరిగిన అంతర్జాతీయ కబడ్డీ టోర్నమెంట్ లోనూ పాల్గొంది. కల్పన, మీరా మధ్య ఈ కబడ్డీ ఆట కారణంగా సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో రెండేళ్ల పాటు వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కాగ మీరా స్వతహాగా మహిళ అయినప్పటికి చూడటానికి అబ్బాయి పోలీకలతో ఉండటంతో ఎలాగైనా కల్పనతో జీవితం పంచుకోవాలని భావించింది. అందుకోసం లింగ మార్పిడి చేయించుకొని పురుషుడిగా మారింది మీరా. పురుషుడిగా మారి ఆరవ్‌గా పేరు మార్చుకుంది. గత కొంత కాలంగా తన స్టూడెంట్ కల్పనతో ప్రేమలో ఉన్న ఆరవ్‌ లింగమార్పిడి ఆపరేషన్‌ సక్సెస్ అయిన తర్వాత వివాహం చేసుకుంది.
తనకు నచ్చిన అమ్మాయి కోసం ఓ యువతి యువకుడిగా మారిన సంఘటన అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. మీరా 2019లో లింగమార్పిడి చేయించుకోవాలని నిర్ణయం తీసుకుంది. అనేక సార్లు లింగమార్పిడి ఆపరేషన్ కోసం ప్రయత్నించింది. చివరకు తన ప్రేయసి సహకారం, పెద్దల అంగీకారంతో విజయం సాధించింది. కావున టీచర్, స్టూడెంట్స్‌గా ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య కబడ్డీ ఆట బలమైన ప్రేమను నింపింది. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ఏ టోర్నమెంట్స్‌కి వెళ్లినా కలిసి వెళ్లేవారు. చివరకు ఈసంవత్సరం నవంబర్ నెల 4వ తేదిన ఆరవ్‌గా మారిన మీరా టీచర్ స్టూడెంట్ కల్పనను గ్రాండ్‌గా వివాహం చేసుకుంది.
అయితే తాను పుట్టడం అమ్మాయిగా పుట్టినప్పటికి ఎప్పటికైనా అబ్బాయిగా మారాలని అనుకునేవాడ్ని లింగమార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత చెప్పాడు ఆరవ్. అయితే ఇందులో భాగంగానే మొదటిసారి 2019సర్జరీ చేయించుకున్నానని చెప్పాడు. ఇక లింగమార్పిడి చేసుకున్న ఆరవ్‌ని పెళ్లాడిన కల్పన కూడా తమది స్వచ్ఛమైన ప్రేమ అని అంటోంది. ఒకవేళ ఆరవ్‌ లింగ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకోకపోయినప్పటికి అతడినే పెళ్లి చేసుకునేదాన్నని తెలిపింది. అన్యోన్యంగా జీవిస్తామన్న భరోసా ఉన్న ఈ వెరైటీ ప్రేమజంట పెళ్లి రెండు వైపుల కుటుంబ సభ్యులు ఆమోదించడంతో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది.





Untitled Document
Advertisements