రెండు మ్యాచ్ లకు తెలుగు రాష్ట్రాల్లో వేదిక ఖరారు.. బీసీసీఐ

     Written by : smtv Desk | Thu, Dec 08, 2022, 03:43 PM

రెండు మ్యాచ్ లకు తెలుగు రాష్ట్రాల్లో వేదిక ఖరారు.. బీసీసీఐ

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో దేశాల మధ్య మరియు రాష్ట్రాల మధ్య అదే ఆట క్రికెట్. ఈ ఆట కోసం ఎంతో మంది ఆడటానికి ఇష్టపడుతూ కష్టపడుతారు. మరియు క్రికెట్ ఆడే సమయంలో అభిమానులు ఆట చూడటానికి స్టేడియం దగ్గరికి వస్తారు అంతేకాకుండా మొబైల్స్ ద్వారా టీవీల ద్వారా చూస్తూ ఎంతో గొప్ప అనుభూతిని పొందుతుంటారు. ఈ ఆటకు ఉన్న స్థాయి అలాంటిది. అయితే తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు వచ్చే ఏడాది భారత పర్యటనకు రానున్నాయి. తొలుత శ్రీలంక.. టీమిండియాతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. న్యూజిలాండ్ కూడా మూడు వన్డేలు, మూడు టీ20ల్లో పోటీ పడనుంది. ఆస్ట్రేలియా మాత్రం నాలుగు టెస్టుల సిరీస్ తో పాటు మూడు వన్డేల్లో భారత్ తో తలపడుంది.
కాగా ఈ సిరీస్ లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ గురువారం ఖరారు చేసింది. మ్యాచ్ లు జరిగే తేదీలను, వేదికలను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, వైజాగ్ లకు అవకాశం దక్కింది. జనవరి 18వ తేదీన న్యూజిలాండ్ తో తొలి వన్డేకు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 19వ తేదీన ఆస్ట్రేలియాతో రెండో వన్డేకు వైజాగ్ ను వేదికగా ఎంపిక చేసిన బీసీసీఐ తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది.
షెడ్యూల్ వివరాలు..
*శ్రీలంక పర్యటన
తేదీ మ్యాచ్ వేదిక
జనవరి 3 1వ టీ20 ముంబై
జనవరి 5 2వ టీ20 పూణె
జనవరి 7 3వ టీ20 రాజ్ కోట్
జనవరి 10 1వ వన్డే గువాహటి
జనవరి12 2వ వన్డే కోల్ కతా
జనవరి 15 3వ వన్డే తిరువనంతపురం

*న్యూజిలాండ్ పర్యటన
జనవరి 18 1వ వన్డే హైదరాబాద్
జనవరి 21 2వ వన్డే రాయ్ పూర్
జనవరి 24 3వ వన్డే ఇండోర్
జనవరి 27 1వ టీ20 రాంచీ
జనవరి 29 2వ టీ20 లక్నో
ఫిబ్రవరి1 3వ టీ20 అహ్మదాబాద్

*ఆస్ట్రేలియా పర్యటన
ఫిబ్రవరి9–13 1వ టెస్టు నాగ్ పూర్
ఫిబ్రవరి 17–21 2వ టెస్టు ఢిల్లీ
మార్చి 1–5 3వ టెస్టు ధర్మశాల
మార్చి 9–13 4వ టెస్టు అహ్మదాబాద్
మార్చి 17 1వ వన్డే ముంబై
మార్చి 19 2వ వన్డే వైజాగ్
మార్చి 22 3వ వన్డే చెన్నై





Untitled Document
Advertisements