అల్లూరి సీతారామరాజు జిల్లా విచిత్రం.. గాలిలో ఆగిపోయిన షటిల్ కాక్

     Written by : smtv Desk | Fri, Dec 09, 2022, 10:39 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా విచిత్రం.. గాలిలో ఆగిపోయిన షటిల్ కాక్

షటిల్ జెమ్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. చాలా మంది సరదాగా ఆటవిడుపు కోసం ఈ జెమ్ ని ఆడుతూ ఉంటారు. సాయంత్రం పుట ఆఫీసుల నుండి ఇళ్ళకు చేరుకున్న పెద్ద వాళ్ళు పని ఒత్తిడి నుండి బయటపడడానికి ఇంటి ముందు నెట్ తో పనిలేకుండా సరదాగా ఆడడం మనం చూస్తూనే ఉంటాము. ఆడా మగా, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఆడడం మనం చూస్తూనే ఉంటాము. షటిల్ కాక్ ని బ్యాట్ తో కొట్టినప్పుడు అది అవతలి వ్యక్తి కొట్టడానికి అనువుగా వెళ్ళడం లేదా కింద పడిపోవడం జరుగుతుంది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రెండు కాకుండా గాలి మధ్యలో షటిల్ కాక్ ఆగిపోయిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి వీక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం టేకులబోర గ్రామంలో చోటుచేసుకుంది. వైరల్ వీడియోలో, ఒక బాలుడు వారు షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నట్లు చెప్పడం చూశాడు మరియు అకస్మాత్తుగా షటిల్ కాక్ గాలి మధ్యలో ఆగిపోయింది.
బాలురు షటిల్ బ్యాట్‌ను గాలిలోకి విసిరేయడంతో షటిల్ కాక్ అరగంటకు పైగా ఆగి నేలపై పడిపోయినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది.
https://youtu.be/-nxHMpA9vMU





Untitled Document
Advertisements