డబల్ సెంచరీతో సరికొత్త రికార్డ్.. చెలరేగిన కుర్ర ఇషాన్

     Written by : smtv Desk | Sat, Dec 10, 2022, 04:02 PM

డబల్ సెంచరీతో సరికొత్త రికార్డ్.. చెలరేగిన కుర్ర ఇషాన్

టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషన్ ఇతని ఆట తీరు అద్బుతంగా ఉన్నప్పటికీ ఎప్పటి వరకు అతనికి సరైన అవకాశాలు రాలేదనే చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు అతను బెంచ్కే పరిమతం అవ్వాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి కారణం.. టెస్టుల్లో చాన్సు లేదు ఎందుకు అంటే ఆ మ్యాచ్ లో ఆడడానికి రిషభ్ పంత్ ఉన్నాడు. ఇక వన్డేల విషయానికి వస్తే అవకాశం కష్టమే.. ఎందుకంటే కేఎల్ రాహుల్ సంజూ శాంసన్ ఉన్నారు. ఇక మిగిలింది టి20.. అందులోనూ తుది జట్టులో ఉండలేడు.. ఎందుకంటే రిషభ్ సంజూ రాహుల్ ముగ్గురూ పోటీ. మరి ఏం చేయాలి..? గమ్మున బెంచ్ మీద కూర్చోవడం తప్ప ఏమిచేయలేక నిస్సహాయంగా ఆట చూస్తూ కూర్చున్నాడు.
కానీ, ఇప్పడు మాత్రం చెలరేగాడు.. జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీని తలపించేలా అదే రాష్ట్రానికి చెందిన కిషన్ దుమ్మురేపాడు. వన్డేల్లో అనితర సాధ్యమైన డబుల్ సెంచరీ మార్క్ను తాకాడు. ద్విశతకం సాధించిన నాలుగో భారత ఆటగాడిగానూ అంతర్జాతీయంగా ఎనిమిదో బ్యాటర్గా రికార్డు సృష్టించాడు.200 ఒక్కడే బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్ పోగొట్టుకున్న టీమిండియా తీవ్ర విమర్శల్లో ఉంది.
మొన్నటి మ్యాచ్ ల్లో టీమిండియా అంతా కలిపిన 200 పరుగులు చేయడానికి నానా ఇబ్బందులు పడింది. కానీ ప్రస్తుతం జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ ఒక్కడే డబుల్ సెంచరీ బాదేశాడు. అవకాశం వస్తే చాలు విజృంభించడానికి సిద్ధమని టీమ్ఇండియా కుర్రాళ్లు ఎదురు చూస్తుంటారు.
ఇలాంటి సమయంలో అందివచ్చిన అవకాశాన్ని టీమ్ఇండియా యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (210: 134 బంతుల్లో 24 ఫోర్లు 10 సిక్స్లు) చక్కగా అందిపుచ్చుకొని బంగ్లాదేశ్తో మూడో వన్డేలో ఏకంగా రికార్డు డబుల్ సెంచరీ బాదేశాడు. భారత్ తరఫున ద్విశతకం బాదిన నాలుగో బ్యాటర్ ఇషాన్ కిషన్ కావడం విశేషం. కేవలం 126 బంతుల్లోనే ద్విశతకం సాధించి.. ఇప్పటి వరకు క్రిస్ గేల్ (138 బంతుల్లో) రికార్డును తుడిచిపెట్టేశాడు.
మొత్తం 9 డబుల్ లు.. భారత్ వే 6 అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం తొమ్మిది డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో భారత్ నుంచే నలుగురు బ్యాటర్లు ఆరు ద్విశతకాలు బాదారు. టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ ఏకంగా మూడుసార్లు (264 209 208*) డబుల్ సెంచరీలు చేశాడు. వ్యక్తిగత స్కోర్లలో రోహిత్ (264)నే టాప్. వీరేంద్ర సెహ్వాగ్ (219) సచిన్ టెండూల్కర్ (200*) కూడా ఈ జాబితాలో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ (237* కివీస్) విండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ (215 విండీస్) పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ (210*) కూడా ద్విశతకాలను సాధించారు.





Untitled Document
Advertisements