రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కు కారణం అదేనా?.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

     Written by : smtv Desk | Mon, Jan 02, 2023, 11:16 AM

రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కు కారణం అదేనా?.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన తల్లికి నూతన సంవత్సరం సందర్భంగా సర్ ప్రైస్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళ్తుండగా జాతీయ రహదారిలో తాను నడుపుతున్న లగ్జరీ కారు రూర్కి వద్ద ఊహించిన విధంగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో కారులో నుంచి మంటాలు చెలరేగడంతో ఓ బస్ డ్రైవర్ చలవతో ఈ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా కారు అక్కడిక్కడే దగ్దమైంది. కావున పంత్ కు ప్రస్తుతం డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. అయితే ఈ ఘటన ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి రోడ్డు ప్రమాదానికి గల కారణం ఏంటి అన్న విషయంపై వివరాలను దర్యాప్తు చేసి సేకరిస్తున్నారని చెప్పాలి. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి ఇక రహదారిపై ఉన్న ఒక గుంతే కారణం అని తెలుస్తుంది. రవీంద్ర రాటి, పంకజ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే స్థానికులు ఇటీవల మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.
కాగా రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కి గురైన ప్రాంతంలో గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయని.. ఇక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంటూ స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో హైవే కాస్త ఇరుకుగా ఉంటుందని.. అంతేకాకుండా సర్వీస్ రోడ్డు కూడా ఇప్పటివరకు ఏర్పాటు కాలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడున్న మలుపుల వద్ద డ్రైవర్లు తడబాటుకు గురవుతుంటారని.. ముఖ్యంగా రోడ్డుపై ఉండే గుంతలు ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. పంత్ కారు కూడా ఇలాగే గుంతలో పడే అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు అభిప్రాయపడ్డారు. అయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి సైతం దీన్ని నిర్ధారించడం గమనార్హం. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పంత్ ప్రమాదానికి గురైనట్లు చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements