మోహన్ బాబు సినిమాకు సెన్సార్ పూర్తి..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:21 PM

మోహన్ బాబు సినిమాకు సెన్సార్ పూర్తి..

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ప్రముఖ నటుడు మోహన్ బాబు నటించిన చిత్రం 'గాయత్రి'. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రియ, అనసూయ కీలక పాత్రలలో నటించారు. సినిమా షూటింగ్ ఆరంభం నుండి ఒక్కొక్క పోస్టర్ ను విడుదల చేస్తూ అందరినీ ఆకట్టుకుంది.

ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. ఈ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్ మూవీ ఫిబ్రవరి 9న విడుదల కాబోతుంది.

Untitled Document
Advertisements