నరబలి మిస్టరీని చేధించిన పోలీసులు..

     Written by : smtv Desk | Tue, Feb 06, 2018, 02:38 PM

నరబలి మిస్టరీని చేధించిన పోలీసులు..

హైదరాబాద్, ఫిబ్రవరి 6 : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పసికందు నరబలి మిస్టరీని ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఉప్పల్ చిలకానగర్‌లో కలకలం సృష్టించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్‌ అని దర్యాప్తులో తేల్చారు. సంపూర్ణ చంద్రగ్రహణం రోజు రాత్రి 3 నెలల పసికందును కిరాతకంగా నరికి తలను డాబాపై పడేసింది రాజశేఖరే అని పోలీసుల వెల్లడించారు. దీంతో రాజశేఖర్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అయిదుగురిని కూడా త్వరలో అరెస్టు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

Untitled Document
Advertisements