ముగిసిన డెడ్‌లైన్.. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్..

     Written by : smtv Desk | Mon, Oct 16, 2023, 10:26 AM

ముగిసిన డెడ్‌లైన్.. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్..

ఇజ్రాయల్, హమాస్ ల మధ్య యుద్ధం మరింత ముదురుతుంది. హమాస్ ఉగ్రదాడులకు దీటుగా ఇజ్రాయల్ పోరాడుతుంది. పాలస్తీనీయులు గాజాలో విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయల్ పాలస్తీనీయులకు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే గాజాను విడిచిపెట్టాలంటూ ఇజ్రాయెల్ ఇచ్చిన వార్నింగ్ డెడ్‌లైన్ ముగిసింది. ఇప్పటి వరకు పది లక్షలమందికిపైగా పాలస్తీనీయులు గాజాను విడిచిపెట్టారు. గాజాపై దండెత్తేందుకు సిద్ధమైన ఇజ్రాయెల్ ఇప్పటికే గాజా సరిహద్దులో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్), ఇజ్రాయెలీ ఎయిర్‌పోర్స్ (ఐఏఎఫ్) సహా 4 లక్షల మంది రిజర్వులను మోహరించింది.

గాజాపై భూతలదాడికి సిద్ధమైన ఇజ్రాయెల్ జనసాంద్రత కలిగిన గాజా ఉత్తర ప్రాంతానికి నీళ్లు, విద్యుత్తు సరఫరా నిలిపివేసింది. ఆహారం అందకుండా చేసింది. గాజా దక్షిణ ప్రాంతానికి మాత్రం నిన్న నీటి సరఫరాను పునరుద్ధరించింది. ఇజ్రాయెల్‌పై దాడులకు సూత్రధారిగా భావిస్తున్న హమాస్ కమాండర్ యహ్యా సిన్వార్‌ను ‘డెడ్ మ్యాన్ వాకింగ్’ (నడుస్తున్న చనిపోయిన వ్యక్తి)గా ఇజ్రాయెల్ మిలటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ రిచర్డ్ హెచ్ట్ అభివర్ణించారు.





Untitled Document
Advertisements