ప్రియా ప్రకాశ్ కు సుప్రీం కోర్టులో ఊరట..

     Written by : smtv Desk | Wed, Feb 21, 2018, 12:31 PM

ప్రియా ప్రకాశ్ కు సుప్రీం కోర్టులో ఊరట..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 : కేరళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ప్రియా.. కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు తెలంగాణ, మహారాష్ట్రాలలో తనపై నమోదైన కేసులపై స్టే విధించిన సుప్రీం కోర్టు.. ఆ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నటి ప్రియా ప్రకాష్ పై, దర్శకుడిపై ఎక్కడ క్రిమినల్ కేసులు పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన "ఒరు అదర్ లవ్" చిత్రంలోని ఓ పాటకు హీరోయిన్ ప్రియా ప్రకాష్ తన హావాభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements