ఆ సత్తా కేసీఆర్ కు ఉంది : కడియం

     Written by : smtv Desk | Mon, Mar 05, 2018, 02:57 PM

ఆ సత్తా కేసీఆర్ కు ఉంది : కడియం

వరంగల్, మార్చి 5 : దేశంలో ఏర్పడబోయే థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహించే శక్తి, సామర్ధ్యాలు కేసీఆర్ కు ఉన్నాయంటూ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మంత్రి చందూలాల్ తో కలిసి హన్మకొండ శ్రీహరి సర్క్యూట్‌ హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భాజాపా, కాంగ్రెస్ పార్టీలు ఘోరమైన వైఫల్య౦ చెందాయని విమర్శించారు. మోదీ నాయకత్వంలో బ్యాంకుల స్కామ్ జరుగుతుందని ఆరోపించారు. అలాగే కాంగెస్ అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. ఇలాంటి పరిస్థితి పోయి వ్యవస్థలో మార్పు వచ్చి ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్, బీజేపీయేతర థర్డ్ ఫ్రంట్ రావాలని అభిప్రాయపడ్డారు.

Untitled Document
Advertisements