ప్రేమ, పెళ్ళిలో క్షమాగుణం కచ్చితంగా ఉండాలట!

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 09:31 AM

ప్రేమ, పెళ్ళిలో క్షమాగుణం కచ్చితంగా ఉండాలట!

ప్రేమ. పెళ్ళి , రిలేషన్ ఏదైనా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం చాల ముఖ్యం. అయితే ఏదైనా వాగ్దానం చేసే ముందే అందుకు మీరు కట్టుబడి ఉండగలరో లేదో చెక్ చేసుకుని మాటివ్వడం ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్ లో మ్యారేజ్ కి ముందు మీరు మీ పార్టనర్ తో కొన్ని విషయాలు మాట్లాడతారు. వాటికే కట్టుబడి ఉన్నామని చెబుతారు. అలాంటి వాగ్దానాలు ఏంటి.. అసలు లవ్ ప్రామిసెస్ అంటే ఏంటో తెలుసుకోండి.

రిలేషన్ షిప్ లో గౌరవం అనేది చాలా ముఖ్యమైంది. ఒకరి అభిప్రాయాలు, ఒకరి ఆలోచనలు మరొకరు గౌరవించాలి. అదే విధంగా, మీ రిలేషన్ లో నిజాయితీగా ఉండడం చాలా ముఖ్యం. మీ పర్సనల్స్ ఏవైనా మీ పార్టనర్ ముందు నిజాయితీగా ఒప్పుకోవాలి. ఆ వాగ్దాననాన్ని నిలబెట్టుకోవాలి.
మీరు మీ పార్టనర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. నమ్మకాన్ని పోగొట్టే పనులు చేయొద్దు. దీంతో పాటు వారికి సపోర్ట్ ఉంటామని ముందులో ఎవరైనా ప్రమాణం చేస్తారు. దీనిని కచ్చితంగా వారు ఎలాంటి బాధలో ఉన్నా వారకి అండగా ఉండాలి. అదే ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి.
దీంతోపాటు రిలేషన్ షిప్ లో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ కాదు. బాధ్యతలు, నిర్ణయాలు, అధికారం అన్ని కూడా సమానమని తెలుసుకోవాలి. దీంతో పాటు, సమస్య ఎంత పెద్దదైనా కూడా మాట్లాడుకోవాలి. ఇది ప్రమాణం చేయకపోయినా పాటించాల్సిందే.
మనం ప్రతిసారి తప్పులు చేస్తుంటాం. ఈ తప్పులు క్షమించే గుణం ఉండాలి. ఎలాంటి పరిస్థితిలోనైనా ఏదైనా తప్పు చేసినప్పుడు అర్థం చేసుకుని వాటిని క్షమించాలి. వీటితో పాటు పార్టనర్ ప్రతి రోజూ కాసేపు టైమ్ ని గడపండి. ప్రేమలో ఎలా వారితో ఉండి సమయాన్ని గడుపుతారో అదే ప్రమాణాన్ని పెళ్ళి తర్వాత కూడా కొనసాగించండి.





Untitled Document
Advertisements