ఒంట్లోని చెడు కొవ్వును కరిగించే 5 ఆహారపదార్థాలు ఇవే!

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 12:49 PM

ఒంట్లోని చెడు కొవ్వును కరిగించే 5 ఆహారపదార్థాలు ఇవే!

ప్రస్తుతకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోయింది. మారిన జీవన శైలీ, శారీరక శ్రమ లేకపోవడం, లైఫ్‌స్టైల్‌ మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి వంటి కారణాల వల్ల.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌లు పేరుకుపోవడం జరుగుతుంది. అయితే శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలు పెరగడం వలన గుండె సమస్యలు, హార్ట్‌ ఎటాక్‌, స్ట్రోక్‌, హైపర్‌టెన్షన్‌ వంటివి సంభవించే ముప్పు పెరుగుతుంది. అందుకే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించుకోవడం ముఖ్యం. అయితే ఆహారంలో మార్పులు చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాలు ఏంటో చూద్దాం..

* అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ అవకాడో తింటే.. రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. ఈ పండ్లలో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను భోజనంతోపాటు తీసుకుంటే కడుపు నిండటంతోపాటు అనవసర కొవ్వులు పేరుకుపోకుండా నిలువరిస్తుంది. అవకాడోలో విటమిన్ ఈ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ని ఆక్సిడేషన్ చేస్తుంది. అధ్యయనాల ప్రకారం, రోజూ అవకాడోలను తినడం వల్ల ఆక్సిడైజ్డ్ LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

* బ్లాక్‌బెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, క్రాన్‌బెర్రీస్, బ్లూస్, స్ట్రాబెర్రీల్లో ఫ్లేవనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. వీటినిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాదు, వీటిలోని ఫైబర్‌.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి, హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. బెర్రీలలోని పోషకాలు రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతాయి. మంచి కొలెస్ట్రాల్‌.. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తాయి.

* గుత్తివంకాయ కూర అంటే.. ఇష్టపడనివారుండరు. వంకాయ రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడతాయి. వీటిలోని కరిగే ఫైబర్‌ మెండుగా ఉంటుంది. వంకాయలో ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు.. గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.

* మన శరీరానికి కావవలసిన పోషక పదార్థాలు ఆపిల్ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి యాపిల్స్‌ మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫైబర్‌, విటమిన్‌ సి, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫొలేట్, బీటా కెరోటీన్‌, విటమిన్‌ కె తదితర పోషకాలు మన శరీరానికి సంపూర్ణ పోషణను అందిస్తాయి. యాపిల్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడతాయి. యాపిల్స్‌ రోజూ తింటే కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.

* బెండకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రొటీన్లు , క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బండకాయలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, కరిగే, కరగని ఫైబర్‌ మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ కరిగించడానికి తోడ్పడతాయి.






Untitled Document
Advertisements