ప్రతి మహిళ వద్ద ఉండాల్సిన ముఖ్యమైన 4 ఆభరణాలు ఇవేనట!

     Written by : smtv Desk | Tue, Feb 13, 2024, 02:36 PM

ప్రతి మహిళ వద్ద ఉండాల్సిన ముఖ్యమైన 4 ఆభరణాలు ఇవేనట!

ఆడవారు అమితంగా ఇష్టపడే వాటి జాబితాలో మొదటి స్థానం అలంకరణ వస్తువులదే. అందులోకి మరీ ముఖ్యంగా చీరలు, నగలపై ఉన్న ఇష్టాన్ని ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు. సందర్భానికి తగ్గట్టు, ట్రెండ్ కి అనుగుణంగా ఉండే చీరలు, నగలు ధరించి నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తూ మెరిసిపోవాలి అని కోరుకుంటారు. అయితే కాలం గడిచిన ఎప్పటికీ ఆదరణ తగ్గని ఆభరణాల జాబితాలో ఉండేవి ముత్యాలే. తెల్లగా మెరిసిపోతూ.. మగువులకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ముత్యాల నగలు.. అటు ట్రెండీగా, సాంప్రదాయంగా ఆకట్టుకుంటాయి. చీర మీదైనా, లెహంగా, డ్రెసెస్‌ మీద కుడా చక్కగా సెట్ అయిపోతాయి. అదేవిధంగా ఈ ముత్యాల నగలు ధరించిన వారి దర్భాన్ని కూడా పెంచుతాయి. ప్రతి అమ్మాయి, మహిళ కచ్చితంగా తమ నగల పెట్టెలో ఉంచుకోవలసిన నాలుగు ముత్యాల నగల జాబితా ఏంటో తెలుసుకుందామా..


* సింపుల్గా హుందాగా కనిపించే పెర్ల్‌ లాకెట్‌ ధరిస్తే మీ లుక్‌ ఇంకా ఎలివేట్‌ అవుతుంది. మీరు ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా.. ముత్యం లాకెట్‌ సూట్‌ అవుతుంది.

* ప్రతి అతివ వద్ద ముత్యాల చెవిరింగులు కచ్చితంగా ఉండాలి. పెర్ల్‌ డ్రాప్స్‌, స్టడ్‌లు, హోప్స్‌ ఇలా చాలా రకాలు ఉంటాయి. పెర్స్‌ ఇయర్‌ రింగ్స్‌.. ఎలాంటి వారికైనా ప్రత్యేకమైన వైబ్‌ని తీసుకొస్తాయి. మీరు డైలీ వేర్‌ కలెక్షన్‌లోనూ పెర్ల్‌ ఇయర్‌రింగ్స్‌ పెట్టుకోవచ్చు. ట్రెండీ దుస్తులకు, సాంప్రదాయ వస్త్రాలకు.. సరిగ్గా సరిపోతాయి.

* ముత్యాన్ని పొదిగే ఉంగరం.. స్వచ్ఛత, సమగ్రత, దాతృత్యాన్ని సూచిస్తుంది. పెర్ల్‌ రింగ్స్‌ ట్రెండీ లుక్‌ను తీసుకురావడంతోపాటు.. పాతకాలపు స్టేట్‌మెంట్ దుస్తులతోనూ బాగా నప్పుతాయి. స్కార్ఫ్‌లు, హై-నెక్ షీర్ టాప్‌లు, సున్నితమైన బ్యాగ్‌తో ఉత్తమంగా ఉంటాయి. ముత్యాలు.. డార్క్ షేడ్ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఆఫీస్, డేట్‌ నైట్‌లకు స్టైలిష్‌ ఫిట్‌గా కనిపిస్తాయి.

* ముత్యాల బ్రాస్‌లెట్స్‌ ఇవి ఎప్పుడూ ఓల్డ్‌ ప్యాషన్‌ కావు. ఇవి ట్రెండీగా, క్లాసీగా కనిపిస్తాయి. మీ క్లాస్‌ను కూడా పెంచుతాయి. ముత్యాల బ్రాస్‌లెట్‌ పెట్టుకున్న వెంటనే.. మీరు ధరించిన డ్రెస్‌ లుక్‌ కూడా ఎలివేట్‌ అవుతుంది. ముత్యాల బ్రాస్‌లెట్‌.. ఎథ్నిక్‌, ఆఫీస్‌ ఫిట్‌లతోనూ క్లాసిక్‌, చిక్‌గా కనిపిస్తాయి. మీరు ఏ డ్రెస్‌పైనా.. ముత్యాల బ్రాస్‌లెట్‌ ధరించవచ్చు.

అయితే ముత్యాలా చాలా సున్నితంగా ఉంటాయి. మీరు మేకప్‌, డ్రెస్సింగ్‌ పూర్తయ్యాక చివరగా మెడలో పెర్ల్‌ లాకెట్‌ ధరించాలి. . వీటిని వేసుకున్నాక మేకప్‌, హెయిర్‌స్ప్రే జోలికి వెళ్లకూడదు. వాటిలోని కెమికల్స్‌.. ముత్యాల నాణ్యతను, మెరుపును తగ్గిస్తాయి. ధరించిన ప్రతిసారీ రాత్రి నిద్రపోయేముందు వీటిని తీసి భద్రపరిచేయాలి.










Untitled Document
Advertisements