ఈ టిప్ ఫాలో అయితే కొన్న ప్రతి చీరకు బ్లౌజ్ కుట్టించే పనిలేదు!

     Written by : smtv Desk | Wed, Feb 14, 2024, 11:23 PM

ఈ టిప్ ఫాలో అయితే కొన్న ప్రతి చీరకు బ్లౌజ్ కుట్టించే పనిలేదు!

ఎన్నిరకాల ట్రెండీ బట్టలు అందుబాటులోకి వచ్చినా ఆడవారికి చీరాల పై ఉండే మక్కువ ప్రత్యేకం. ఆ మక్కువతోనే చీరలు కొనేస్తారు. అయితే బీరువా నిండా ఎన్ని కొత్తచీరాలు ఉన్న సరే పండగలు పబ్బాలు వచ్చాయి అంటే కొత్త చీర కొనడానికి సిద్దం అయిపోతారు. మరి ఇన్ని చీరలకు అన్నీ జాకెట్లు జత చేయడం సులభమైన పనా చెప్పండి ? కాదు కదా కానీ కొన్ని రంగుల బ్లౌజులతోనే దాదాపు మీరు చీరల్ని కట్టుకోవచ్చు అంటే నమ్ముతారా.. నమ్మరు కదా ? కానీ అది నిజం. మరి అన్ని చీరలకు సరిగ్గా సరిపోయే రంగులేంటో చూద్దాం పదండి..

* ఎరుపు:- ఎరుపు రంగు బ్లౌజ్ ని మీరు చాలా వాటికి మీదకి వాడచ్చు ఉదాహరణకి నీలం ప్రింట్స్ ఉన్న శారీ పై లేదా ఎరుపు రంగు నప్పే ఏ సాలిడ్ కలర్ చీర మీదకైనా మీరు ఈ రెడ్ కలర్ బ్లౌజ్ వాడచ్చు.

* పింక్:- పింక్ కలర్ అనేది దాదాపు అన్నీ రంగుల చీరల మీదకి బాగుంటుంది. ఉదాహరణకి ఏదైనా చీర మీద పింక్ కలర్ డిజైన్ ఉన్నా, లేదా బ్లూ లాంటి చీరల పై కాంట్రాస్ట్ లాగా, గ్రే లాంటి డల్ షేడ్స్ పైన, బ్రైట్ కలర్స్ లైక్ యెల్లోతో జత చేయచ్చు.

మెరూన్:- ఈ రంగు ట్రెడిషనల్ అలాగే పార్టీ వేర్ చీరల మీదకి చాలా బాగా నప్పుతుంది. ముదురు ఆకుపచ్చ, బంగారం లాంటి రంగులున్న చీరలకు మెరూన్ రంగు బ్లౌజ్ చాలా చాలా బాగా కనిపిస్తుంది.

* నేవి బ్లూ:- బ్లూ అనేది దాదాపు అందరి ఫేవరెట్ కలర్. ఒకవేళ మీ దగ్గర ఈ కలర్ బ్లౌజ్ ఉన్నట్లైతే దీన్ని మీరు చాలా చీరల మీదకే మ్యాచ్ చేయచ్చు. ఉదాహరణకి రెడ్, గ్రీన్, ఆరెంజ్ లాంటి రంగుల చీరల మీదకి ఈ బ్లౌజ్ బాగా నప్పుతుంది

* గోల్డ్:- గోల్డ్ రంగు బ్లౌజ్ అయితే అన్ని రకాల చీరల మీద గుడ్డిగా వేసుకోవచ్చు. మీరు తీస్కున్న చీర మీద గోల్డ్ కలర్ డిజైన్ ఉంటే మాత్రం మీరింకేం ఆలోచించకుండా గోల్డ్ కలర్ బౌజ్ తో జత చేసేయండి.

* బాటిల్ గ్రీన్:- ఒకవేళ మీ చీరల మీద పచ్చ రంగు బుటాస్ ఉన్నా, లేదా మీ చీర బార్డర్ పచ్చ రంగు ఉన్నట్లైతే మీరు నిర్మొహమాటంగా ఈ పచ్చ రంగు బ్లౌజ్ ని వేసుకోవచ్చు. అలాగే ఆ రంగుకి కాంట్రాస్ట్ గా నిలిచే మెరూన్, పింక్, ఆరెంజ్ లాంటి రంగులున్న చీరలను తప్పక ట్రై చేయండి.

* ఆరెంజ్ :- ఈ రంగు అయితే నలుపు, నీలం, గులాబీ, ఎరుపు, బ్రౌన్ లాంటి రంగులకి చక్కగా సరిపోతుంది. ఇవే కాక మీరు చీర మీద ఉండే చిన్న చిన్న ప్రింట్స్ ఆర్ కుందన్ వర్క్ తో జత చేయవచ్చు.

* బ్లాక్:- మీ చీర మీద ఏమాత్రం బ్లాక్ కలర్ డిజైన్ ఉన్నా సరే మీరు వెంటనే దాన్ని ఈ నలుపు రంగు జాకెట్టుతో చీరని కట్టుకోవచ్చు.

అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు తీస్కునే ఏ బ్లౌజ్ అయినా సరే గోల్డెన్ డిజైన్ మాత్రమే ఉండాలి మరే ఏ రంగు కలిసిన అవి అన్నిటిమీదకి అంతలా నప్పవు కాబట్టి బ్లౌజ్ కొనే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకుని కొనండి.





Untitled Document
Advertisements