రోజు ఈ టీ తాగితే ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు..

     Written by : smtv Desk | Sat, Feb 17, 2024, 05:11 PM

రోజు ఈ టీ తాగితే ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు..

చైనీస్ తమ ఆరోగ్య సంరక్షణ కొరకు తరుచుగా ఊలాంగ్ టీ తాగుతుంటారు. ఈ టీ ని తాగడం వలన మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు సైతం చెబుతున్నారు.
ఈ ఊలాంగ్ టీ అనేది సాంప్రదాయ చైనీస్ టీ. ఇది ఆక్సీకరణ స్థాయిల పరంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ మధ్య ఉంటుంది. ఊలాంగ్ టీని కామెల్లియా సినెన్సిస్ ప్లాంట్ నుంచి తయారుచేస్తారు. దీన్ని పాక్షికంగా పులియబెడతారు. దీని ఫలితంగా ఇది ప్రత్యేకమైన రుచి, అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. ఊలాంగ్ టీలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, పోషకాల కారణంగా అరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ టీని తీసుకోవడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఊలాంగ్ టీ జీవక్రియను మెరుగుపరుస్తుంది, శరీరంలో కొవ్వు త్వరగా కరిగేలా సహాయపడుతుంది. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఊలాంగ్ టీలోని పాలీఫెనాల్స్ కొవ్వును విచ్ఛిన్నతను పెంచే ఎంజైమ్ లను యాక్టివ్ చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్స్ థాయిలు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఊలాంగ్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఊలాంగ్ టీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ప్రీ డయాబెటిక్ దశలో ఉన్నవారూ ఈ టీ తీసుకుంటే.. మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, ఇన్సులిన్ స్రావాన్ని ప్రోత్సహిస్తుంది.

ఊలాంగ్ టీ జీర్ణవ్యవస్థలో మంటను తగ్గించడానికి, యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గించి.. జీర్ణక్రియ ప్రక్రియకు సహాయపడుతుంది. దీనిలో కడుపులో అసౌకర్యాన్ని తగ్గించే.. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి.

ఊలాంగ్ టీలో కెఫీన్ ఉంటుంది, ఇది మానసిక చురుకుదనాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ఇది అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది, ఉత్పాదకతను పెంచుతుంది.

ఊలాంగ్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి సహాయపడతాయి, చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. తద్వారా ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహిస్తాయి. చిన్నతనంలో వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది. తద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది మొత్తం ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

ఊలాంగ్ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే.. ఎముక ఖనిజ సాంద్రత మెరుగుపడుతుంది, బోలు ఎముకల వ్యాధి ముప్పును తగ్గిస్తుంది. ఊలాంగ్ టీలోని ఫ్లేవనాయిడ్లు.. ఎముకల బలానికి అవసరమైన ఖనిజాలను నిలుపుకోవడంలో సహాయపడతాయి.

ఊలాంగ్ టీలో ఎల్-థియానైన్ అనే అమినో యాసిడ్ మెదడుపై ప్రశాంతతను కలిగిస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. మగత కలిగించకుండా విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది.

ఊలాంగ్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి నోటిలో హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి, దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వంటి దంత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.





Untitled Document
Advertisements