ఈ చేర్రీలు ప్రత్యేకమట.. గుండె ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలున్నాయంటున్న నిపుణులు !

     Written by : smtv Desk | Tue, Feb 20, 2024, 08:21 AM

ఈ చేర్రీలు ప్రత్యేకమట.. గుండె ఆరోగ్యంతో పాటు మరిన్ని లాభాలున్నాయంటున్న నిపుణులు !

యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే టార్ట్ చెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకురుస్తాయని న్యూట్రియెట్స్ MDPI జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం స్పష్టం చేసింది. ఆ అధ్యయనంలో ఉన్న కథనం ప్రకారం టార్ట్ చెర్రీస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం..
టార్ట్ చెర్రీస్ .. వీటిని మోంట్ మోరెన్సీ, డ్వార్ఫ్, సోర్ చెర్రీస్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి చూడటానికి సాధారణ చెర్రీలలానే కనిపిస్తుంటాయి, కానీ రుచిలో మాత్రం కొంచెం పుల్లగా ఉంటాయి. వీటిని పచ్చిగా ఉన్నప్పుడే ఎక్కువగా తింటూ ఉంటారు. టార్ట్ చెర్రీలను.. ప్రోజ్ చేసిన, ఎండబెట్టిన, పొడి, జ్యూస్ రూపంలోనూ తీసుకోవచ్చు. టార్ట్ చెర్రీ జ్యూస్ తరచు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వీటిలో మన శరీరానికి మేలు చేసే మినరల్స్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. టార్ట్ చెర్రీ జ్యూస్ తరచు తీసుకుంటే శరీరంలో వాపును తగ్గిస్తాయి. కీళ్లనొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు టార్ట్ చెర్రీస్ జ్యూస్ తరచు తీసుకుంటే కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు.

వ్యాయామం ఎక్కువగా చేసేవారు.. కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించడానికి.. తరచు టార్ట్ చెర్రీ జ్యూస్ తాగండి. విలే స్కాండినేవియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ లో ప్రచురించిన ఒక అధ్యయనంలో.. టార్ట్ చెర్రీ జ్యూస్ కండరాల నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. టార్ట్ చెర్రీస్ లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది వ్యాయమం వల్ల కండరాల నొప్పిని తగ్గించడానికి తోడ్పడుతుంది.

టార్ట్ చెర్రీ జ్యూస్ మెలటోనిన్ సహజ మూలం. ఇది నిద్ర-మేల్కొనే చక్రాలను నియంత్రించే హార్మోన్. టార్ట్ చెర్రీ జ్యూస్ తరచు తీసుకుంటే.. నిద్ర నాణ్యత, స్లీప్ సైకిల్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది నిద్రలేమి సమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది.

కీళ్ల నొప్పులు ఉన్నవారు టార్ట్ చెర్రీ జ్యూస్ తాగితే మంచిది. కరెంట్ న్యూట్రియంట్ డెవలప్ మెంట్ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, టార్ట్ చెర్రీ జ్యూస్ ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ లక్షణాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది.

టార్ట్ చెర్రీస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని , శరీరంలో వాపును తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టార్ట్ చెర్రీస్ లోని పోషకాలు.. హైపర్ టెన్షన్ తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడానికి తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు.

టార్ట్ చెర్రీస్ జ్యూస్ మీ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. IMC జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం.. టార్ట్ చెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్లు న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలు ఉంటాయని పేర్కొంది. ఇది వయస్సు-సంబంధిత అభిజ్ఞా క్షీణత, అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తుంది.

టార్ట్ చెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను తటస్తం చేయడానికి సహాయపడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇది గుండె జబ్బులు, కొన్ని క్యాన్సర్ల వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.





Untitled Document
Advertisements