రోజా ఐటెమ్ రాణి .. కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

     Written by : smtv Desk | Tue, Feb 27, 2024, 01:13 PM

రోజా ఐటెమ్ రాణి ..  కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజాపై సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ నిప్పులు చెరిగారు. రోజాను తీవ్ర వాఖ్యలతో విమర్శించారు. . రోజా ఒక ఐటెమ్ రాణి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక జాక్ పాట్ సీఎం అంటూ రోజా
చేసిన వాఖ్యాల నేపథ్యంలో... ఆమెకు బండ్ల గణేశ్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రోజా ఒక డైమండ్ రాణి అని... ఆమె పని చేస్తున్న పార్టీ నాయకుడు ఒక యాక్సిడెంటల్ సీఎం అని అన్నారు. రేవంత్ ఒక డైనమిక్ లీడర్ అని... రోజా మాదిరి చేపల పులుసు వండి పెడితే ఇక్కడ పదవులు రావని చెప్పారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై కూడా బండ్ల గణేశ్ సెటైర్లు వేశారు. కేటీఆర్ మానసిక క్షోభలో ఉన్నారని... పగవాడికి కూడా అలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. కేటీఆర్ చుట్టూ ఈగో వైఫై మాదిరి ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో ఏదో సాధిస్తామనే భ్రమల్లో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో కేటీఆర్ కు మరిన్న కష్టాలు తప్పవని జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరో కేటీఆర్ చెప్పాలని అన్నారు. ఫోన్ రింగ్ అయినా కేటీఆర్ భయపడిపోతున్నారని చెప్పారు.





Untitled Document
Advertisements