అమెరికా అధ్యక్షపదవి.. డెమొక్రాటిక్ పార్టీ నుండి బరిలో నిలిచేదేవరు?

     Written by : smtv Desk | Wed, Feb 28, 2024, 12:58 PM

అమెరికా అధ్యక్షపదవి..  డెమొక్రాటిక్ పార్టీ నుండి బరిలో నిలిచేదేవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో ఈసారి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ కంటే మిచెల్లీ ఒబామా బరిలోకి దిగితే బాగుంటుంది అని ఓ పోల్‌లో వెల్లడయ్యింది. రాస్ముస్సేన్ రిపోర్ట్స్ పోల్‌లో ఎక్కువ మంది బైడెన్ ను పక్కన పెట్టి మిచెల్లీ ఒబామావైపే మొగ్గుచూపారు.
బైడెన్ స్థానంలో ఇతర పోటీదారులు వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, మాజీ విదేశాంగ కార్యదర్శి హిల్లరీ క్లింటన్, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్, మిచిగాన్ గవర్నర్ గ్రెట్చెన్ విట్మర్ కంటే అధికంగా మిచెల్ ఒబామాకు 20 శాతం ఓట్లు వచ్చాయి. కమలా హ్యారిస్‌కు 15 శాతం, హిల్లరీ క్లింటన్‌కు 12 శాతం ఓట్లు మాత్రమే రావడం గమనార్హం.

అధ్యక్ష ఎన్నికలలో మిచెల్లీ ఒబామా పోటీ చేయాలని పదే పదే కోరుతున్నారు. రాబోయే ఎన్నికల గురించి ఇటీవల తీవ్ర భయాన్ని వ్యక్తం చేసిన ఆమె.. ఇదోరకం ‘వేటాడటం’ అని అన్నారు. ‘ప్రభుత్వం నిజంగా ఏమైనా చేస్తుందా?' మన కోసం ప్రతిదీ చేస్తుందా? అని ప్రజలు భావిస్తారు.. దీని గురించి నేను కొన్నిసార్లు ఆందోళన చెందుతాను’ అని వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య మళ్లీ పోటీ ఖచ్చితంగా కనిపిస్తుంది. బైడెన్ వయస్సు అడ్డంకిగా ఉందని సర్వేలు సూచించినప్పటికీ తాను ఉత్తమ అభ్యర్థినని నొక్కి చెబుతున్నారు. అటు, పలు కేసులు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి తాను పోటీకి సై అంటున్నారు. మరి ఈసారి అగ్రరాజ్య అధ్యక్ష పదవి ఎవరిని సొంతమవుతుందో.





Untitled Document
Advertisements