మీ చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఇలా చేయండి

     Written by : smtv Desk | Thu, Feb 29, 2024, 10:05 AM

మీ చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవాలంటే ఇలా చేయండి

అందమైన మెరిసే చర్మం కావాలి అనుకునే ప్రతి ఒక్కరు కుడా ప్రతిరోజూ ఈ మూడు పనులు తప్పక పాటించాలి. అవే క్లెన్సింగ్, టోనింగ్ మరియు మాయిశ్చరైజింగ్ దీనినే సీటీఎం రొటీన్ అని కూడా అంటారు. మీ రోజూ వారి చర్మ సంరక్షణ క్లెన్సింగ్ తో మొదలై, టోనింగ్ తరువాత మాయిశ్చరైజింగ్ తో పూర్తవుతుంది.

మొదట క్లెన్సింగ్ మీ మొహం పై దుమ్ము, ధూళిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. తరువాత టొనింగ్ మీ చర్మం యొక్క pH శాతలను సమత్యులంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది మీ చర్మం మెరుగ్గా కనిపించేలా చేస్తుంది. ఇక చివరగా మాయిశ్చరైజింగ్ ఇది మీ చర్మాన్ని పొడిబారకుండా చేసేందుకు సహాయపడుతుంది.

1 క్లెన్సర్ :- ముందుగా మీ చర్మానికి సరిపడే మంచి ఫేస్ వాష్ ఎంచుకోండి. అది మీ చర్మం పై ఉన్న సహజమైన ఆయిల్స్ ని సంరక్షించడంతో పాటు మీ చర్మం పై ఉన్న దుమ్ము ధూళి తొలగించడంలో సహాయపడుతుంది ముందుగా మీ ముఖాన్ని మామూలు ఉష్ణత కల నీటితో తడి చేయండి. మరీ వేడి లేదా చల్లటి నీటిని ముఖం మీద ఉపయోగించడం వల్ల మీ చర్మం పొడిగా, బిగిసిపోయినట్టు అయిపోతుందని గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు చేతిలో కొంచం ఫేస్ వాష్ తీస్కుని దాన్ని మొహమంతా అప్లై చేయండి. సర్కులర్ మోషన్స్ తో చిన్నగా మొహమంతా రుద్దండి. జాగ్రత్త కళ్ళ దగ్గర అస్సలు ఉపయోగించద్దు. మళ్ళీ చన్నీటితో మొహం కడిగేయండి.

ఆయిలీ స్కిన్:- అధిక సెబమ్ ఉత్పత్తి కారణంగా మొహంపై ఎక్కువగా జిడ్డు కారుతూ ఉంటుంది. దీనిని పరిష్కరించేందుకు సాలిసిలిక్ యాసిడ్ లేదా గ్లైకోలిక్ యాసిడ్ మరియు బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ఆల్ఫా-హైడ్రాక్సీ ఆమ్లాలను కలిగి ఉన్న ఉత్పత్తులను ఎంచుకోండి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఫోమ్ బేస్డ్ క్లెన్సర్ లు ఉత్తమంగా పనిచేస్తాయని గుర్తుంచుకోండి.

పొడి చర్మం:- తరుచూ చర్మం పొడిబారే వారు గ్లిజరిన్ మరియు షియా బటర్ వంటి పదార్థాలతో కలిపిన క్రీమ్ లేదా లోషన్ బేస్డ్ క్లెన్సర్ వాడడం మంచిది. ఈ రకం ఫేస్ వాష్ లు చర్మాన్ని శుభ్రపరచడమే కాక వాటిలో ఉన్న మాయిశ్చరైజింగ్ ఏజెంట్లు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేయడానికి కూడా సహాయపడతాయి.

సెన్సిటివ్ స్కిన్:- ఆర్గాన్ ఆయిల్, అలోవెరా, ఓట్మీల్, క్యామొమైల్ మరియు షియా బటర్ వంటి సహజసిద్ధమైన హీలింగ్ పదార్థాలు సున్నితమైన చర్మంపై బాగా పని చేస్తాయి. వీటిలో ఏదోకటి ఉన్న ఫేస్ వాష్ ను ఎంచుకోవడం వలన మాయిశ్చరైజ్ చేయడంతో పాటు మీ ముఖాన్ని టోన్ కూడా చేస్తుంది. అలాగే మీరు ఎంచుకునే ఫేస్ వాష్ లో ఎలాంటి ఆల్కహాల్ మరియు సువాసనలు లేకుండా చూస్కోండి.

2 టోనర్:- క్లెన్సింగ్ చేసిన తరువాత మరే ఇతర ప్రొడక్ట్ వాడే కంటే ముందు మీ చర్మంపై టోనర్ ఉపయోగించాలి. మంచి ఫలితం కోసం కాటన్ ప్యాడ్ పై రెండు చుక్కలు టోనర్ వేసి మీ మొహమంతా అప్లై చేయండి. టోనర్ చర్మం యొక్క pH బ్యాలెన్స్ ని పునరుద్ధరించడమే కాక మీ చర్మం పై మిగిలిన ఉన్న మలినాలను కూడా తొలగిస్తుంది.

ఆయిలీ స్కిన్: ఆయిలీ స్కిన్ కోసం టోనర్ లో సాలిసిలిక్ యాసిడ్ ఉండేట్టు చూస్కోండి.

డ్రై స్కిన్: హైడ్రేటింగ్ గ్లిజరిన్ మరియు ఎసెన్షియల్ ఆయిల్స్ పొడి చర్మం మీద బాగా పనిచేస్తాయి. డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు వీటిలో మీ చర్మానికి సరిపడే ఆయిల్ ని టెస్ట్ చేసి ఎంచుకోవడం మంచిది.

కాంబినేషన్ స్కిన్:- లాక్టిక్ యాసిడ్ బేస్డ్ టోనర్లు కాంబినేషన్ స్కిన్ టైప్ ఉన్న వ్యక్తులకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇవి మన చర్మాన్ని మంచిగా హైడ్రేట్ చేస్తాయి అలాగే మొహంపై ఎలాంటి జిడ్డును కలుగనివ్వదు.

3 మాయిశ్చరైజర్:- మాయిశ్చైజర్ మన చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది. ముఖాన్ని కడిగిన తరువాత మాయిశ్చరైజర్ వాడడం వల్ల మన చర్మం పొడిబారకుండా ఉంటుంది.

ఆయిలీ స్కిన్ :- లైట్ వెయిట్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఆయిలీ స్కిన్ కి సరిగ్గా సరిపోతాయి. అయితే ఇందులో ఎలాంటి ఆయిల్స్ లేకుండా చూస్కోవాలి. మీరు ఎంచుకునే మాయిశ్చైజర్ లో సిరామైడ్ లు, హైలురోనిక్ యాసిడ్ లేదా నియాసినామైడ్ (యాంటీ ఇన్ ఫ్లమేటరీ) లాంటివి ఉండేలా చూస్కోండి.

కాంబినేషన్ / నార్మల్ స్కిన్:- కాంబినేషన్ మరియు నార్మల్ స్కిన్ ఉన్నవారికి హైలురోనిక్ యాసిడ్ మరియు సిరమైడ్ లతో కూడిన లోషన్ లు మంచి ఫలితాలను ఇస్తాయి.

డ్రై స్కిన్: డ్రై స్కిన్ ఉన్నవారు చర్మం పొడిబారకుండా ఉండటానికి, క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్ ని ఆశ్రయించవచ్చు. సిరమైడ్ లు (మీ చర్మ తత్వాన్ని సరిచేయడానికి) మరియు గ్లిజరిన్ ఇంకా హైలురోనిక్ యాసిడ్ (చర్మంలోకి తేమను వెలికి తీయడానికి మరియు సీల్ చేయడానికి) కలిగిన ఉత్పత్తులను కొనుగోలు చేయండి.

రోజు పైన చెప్పిన పద్దతులు పాటిస్తుంటే కనుక కొద్దిరోజుల్లోనే మీ చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.





Untitled Document
Advertisements