రాజధానిలో భూమిలేని పేదలకు పెన్షన్ పెంపు.. జగన్ ప్రభుత్వం

     Written by : smtv Desk | Sat, Mar 02, 2024, 11:04 AM

రాజధానిలో భూమిలేని పేదలకు పెన్షన్ పెంపు.. జగన్ ప్రభుత్వం

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి మూడు రాజధానులు అనే నినాదంతో ముందుకు వెళ్ళిన విషయమ తెలిసిందే. ఎన్నికల సమయం అసన్నమైన కూడా రాజధాని విషయంలో స్పష్టత అయితే రాలేదు కానీ మూడు రాజధానులలో ఒకటైన అమరావతి ప్రజలకు మాత్రం జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అమరావతిలో భూమిలేని పేదలకు అంతే కాకుండా అక్కడ ఎంతో మంది నిర్మాణ పనులు లేక ఇబ్బంది పడుతున్న,కూలీలకు , వచ్చేటువంటి పెన్షన్ 2500 నుంచి 5000 కు పెంచే జీవోను జారీచేసింది . దీనితో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

రాజధాని అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఎస్-3 జోన్ పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే ఆర్- 5 జోన్ లో 1,134 ఎకరాలను పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన పట్టాల పంపిణీకి శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో లబ్దిదారుల సంఖ్య మేరకు అదనంగా భూమి కావాలంటూ కలెక్టర్లు లేఖ రాశారు.

సీఆర్ డీఏ కమిషనర్ ప్రతిపాదనల మేరకు ఏపీ సర్కార్.. అమరావతి రాజధానిలో ఎస్ -3 జోన్ లో పేదల ఇళ్ల స్థలాలకు 268 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు చేసింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్-3 జోన్ లోని 268 ఎకరాలను.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు 168 ఎకరాలు, గుంటూరు కలెక్టర్ కు 100 ఎకరాలు కేటాయించారు.
ఎన్నికల వేళ ప్రజలను మభ్య పెట్టడానికి ప్రభుత్వం కొత్తకొత్త పథకాలను ప్రవేశపెడుతూ వాటి అమలు కొరకు జీవోలను జారీ చేస్తుంది. మరి ఇవి నిజంగా అమలు చేస్తారా లేదా ఓట్ల కొరకు ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నమా అనేది చూడాలి.





Untitled Document
Advertisements