షుగర్ వ్యాధిగ్రస్తూల రక్తంలో గ్లూకోజ్ శాతం ? తీసుకోవలసిన జాగ్రత్తలు

     Written by : smtv Desk | Sun, Mar 03, 2024, 08:07 AM

షుగర్ వ్యాధిగ్రస్తూల రక్తంలో గ్లూకోజ్ శాతం ? తీసుకోవలసిన జాగ్రత్తలు

ఈమధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ వ్యాధితో భాదపడుతున్నారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో ఉండాల్సిన గ్లూకోజ్ శాతం ఎంత ఆనే విషయం పై సరైన అవగాహన లేదు. కొంతమంది తమకు జబ్బులేకున్న లక్షణాలు కనిపిస్తున్నాయి మాకు జబ్బు చేసిందేమో అని భయానికి గురవుతుంటారు. అయితే రక్తంలో ఎంత శాతం గ్లూకోజ్ ఉంటె షుగర్ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణకు రావచ్చు అనేది తెలుసుకుందాం.
* రక్తంలో గ్లూకోజ్ స్థాయి పరగడపున (రాత్రి భోజనం చేసిన ఎనిమిది గంటల తర్వాత) చేసే రక్త పరీక్షల్లో 100 మిల్లీగ్రాముల లోపు ఉంటే మధుమేహం లేనట్లే.
* 126 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మధుమేహం ఉన్నట్లే.
* భోజనం చేసిన తర్వాత చేసే రక్త పరీక్షలో గ్లూకోజ్ స్థాయి 140 మిల్లీగ్రాముల నుంచి 200 మిల్లీ గ్రాములు లోపు ఉంటుంది.
* కానీ, 200 మిల్లీ గ్రాముల కంటే ఎక్కువగా ఉంటే మధుమేహంగా అనుమానించాలి.
* ఓరల్ గ్లూకోజ్ టోలరెన్స్ టెస్ట్ (ఓజీటీటీ) ద్వారా మాత్రమే మధుమేహాన్ని కచ్చితంగా గుర్తించవచ్చు.
ఈ జాగ్రత్తలు పాటించండి
* శారీరక శ్రమ అవసరం. అంటే వ్యాయామం, నడక, ఇతరత్రా పనులు చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
* ఆఫీసుల్లో ఎక్కువ సేపు కుర్చొని పనిచేయాల్సిన వచ్చినప్పుడు.. మధ్య మధ్యలో పైకి లేచి చిన్న చిన్న వ్యాయమాలు చేయండి.
* జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, వేపుళ్లు తదితర వంటకాలకు దూరంగా ఉండండి. మధుమేహం ఉన్నవారు వైద్యులు ఇచ్చే మందులను క్రమంతప్పకుండా వాడాలి.గర్బిణీలకు మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. దీనిని గెస్టేషనల్ డయాబెటిస్ అంటారు.
* గర్భంతో ఉన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయులు పెరిగి.. ఈ సమస్య వస్తుంది.గర్భంతో ఉన్నప్పుడు తప్పకుండా మధుమేహం పరీక్షలుకూడా చేయించుకోవాలి. కొందరిలో ప్రసవం తర్వాత కూడా మధుమేహం కొనసాగవచ్చు.
* శరీరానికి ఎంత కావాలో అంతే తినండి. సాధారణ శారీరక శ్రమ చేసే వ్యక్తులకు రోజుకు 1,800 నుంచి 2,200 కెలోరీల ఆహారం తీసుకోవాలి. ఎక్కువ శారీరక శ్రమచేసేవాళ్లు 2,500 కెలోరీల ఆహారాన్ని తీసుకోవాలి. ఇంతకంటే ఎక్కువ తినకూడదు.
* మధుమేహం ఉన్నవారిలో కిడ్నీలు దెబ్బతిని మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రోటీని చేరుతుంది. దీని వల్ల కిడ్నీలు ఫెయిలవుతాయి. కనీసం 3 నెలలకు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోవాలి.ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే.. మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు.





Untitled Document
Advertisements