వేసవిలో ఈ నీళ్ళు తాగితే చెమట వల్ల వచ్చే దుర్వాసన మాయం!

     Written by : smtv Desk | Mon, Mar 04, 2024, 11:39 AM

వేసవిలో ఈ నీళ్ళు తాగితే చెమట వల్ల వచ్చే దుర్వాసన మాయం!

నిత్యం మనం తీసుకునే ప్రతి ఆహారం కల్తీనే, చివరికి మనం తాగే పాలు మరియు నీళ్ళు కూడా కలుషితమైనవే. అయితే ఎవరు కలుషితం చేయడానికి వీలు లేనటువంటి ఒకే ఒక ఆహారం కొబ్బరి నీరు. కొబ్బరి బొండంలో దాగున్న నీటిని ఎవరు కలుషితం చేయలేరు. అందుకే కొబ్బరి బొండంలోని నీరుని ఆరోగ్యప్రదాయినిగా చూస్తారు. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఈ నీరు ప్రధమ పాత్ర పోషిస్తుంది. అందుకే మండువేసవిలో ప్రతి ఒక్కరు మరువకుండా ఈ నీటిని తాగుతారు. మరి అందరు ఇష్టపడే కొబ్బరి నీటిలో ఉండే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందామా..

* కొబ్బరి నీళ్లు పోషకాలు, ఎలక్ట్రోలైట్లను ఇస్తాయి. ఒక రకంగా కొబ్బరి నీళ్లు నోటి ద్వారా ఒంట్లో చేరే సెలైన్ బాటిల్ తో సమానం. మన శరీరానికి రోజుకు కనీసం 280 మిల్లిగ్రాముల సోడియం కావాలి. ఒక కొబ్బరిబోండాంలో దాదాపు 300 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది. అంటే శరీరానికి కావాల్సిన సోడియం రోజుకు సరిపడా అందినట్టే. ఇక పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే కొబ్బరినీళ్లు ఉత్తమ లవణ జలం.

* కొబ్బరి నీళ్ళని మధ్యాహ్న భోజనానికి ఒక గంట ముందు, లేదా సాయంత్రం వేళల్లో తీసుకుంటే మంచిది. వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి కొబ్బరినీళ్లు ఉత్తమ సహాయకారి. ఎండల్లో వాంతులు, విరేచనాలు అవుతుంటే కొబ్బరినీళ్లను మెల్లమెల్లగా ఎక్కువసేపు తాగితే శరీరం పుంజుకుంటుంది. ఎండ వల్ల చర్మం టాన్ అయితే కొబ్బరినీళ్లతో బాగా రుద్దితే ఆ టాన్ పోతుంది.

* వేసవిలో చెమట వల్ల వచ్చే దుర్వాసన పోవాలంటే కొబ్బరినీళ్లు తాగాలి. జీర్ణక్రియకు మంచిది. కొబ్బరినీళ్లలో ఉన్న పొటాషియం బీపీని నియంత్రించడానికి, కిడ్నీల పని తీరుకు తోడ్పడుతుంది. కొబ్బరి నీళ్లలో యాలకుల పొడి చిటికెడు వేసుకుని తాగితే అరికాళ్లలో మంటలు తగ్గుతాయి. ఎన్ని ఫ్రిజ్లు ఉన్న ,ఎన్ని కూలర్లు ఉన్న, వేసవిలో కోబ్బరి బొండం ఒకటి ఉంటె చాలు మన దాహాన్ని తీర్చడానికి .





Untitled Document
Advertisements