శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర పేరు వెనుక పురాణకథ !

     Written by : smtv Desk | Wed, Mar 06, 2024, 06:52 AM

శ్రీకాళహస్తి పుణ్యక్షేత్ర పేరు వెనుక పురాణకథ !

ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని యొక్క జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రలో ఉన్నపుడు మహా శివరాత్రి వస్తుంది. పరమేశ్వరుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివ పురాణంలో పేర్కొన్నారు. భోళాశంకరుడిగా, ఆదిదేవుడిగా, సర్వజ్ఞుడిగా, పరమశివునిగా కీర్తించబడే పరమాత్మయే ఈశ్వరుడు. ఈ పేరుకు నిగూడ అర్థము ఉంది .
‘శివ’ శబ్దం మంగళాత్మకం..అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది.అనేక గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహాశివుడు.
దీని కారణంగా ఆయనను లోకమంతా పూజిస్తుంది . ఇలాంటి సమయంలో శివుడు ప్రత్యేక్షముగా లింగ రూపంలో వెలిసిన క్షేత్రాలలో ఒకటైన శ్రీకాళహస్తి గురించి తెలుసుకొని ఆ క్షేత్ర దర్శనాన్ని చేసుకొని పుణ్య ఫలితాన్ని పొందాలి మరి .

పంచభూత క్షేత్రాల్లో శ్రీకాళహస్తి ఒకటిగా కనిపిస్తుంది. ఇక్కడ స్వామి వాయు లింగంగా దర్శనమిస్తాడు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారు ఇక్కడ పూజలు అందుకోవడానికి గల కారణం ఒక పురాణ కథను వినిపిస్తూ ఉంటుంది . పూర్వం ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేది ఈ ప్రదేశంలో స్వామి వారు ఆవిర్భవించారు ఒక సాలేడు వారిని సేవిస్తూ ఉండేది అలాగే ఒక పాము, ఏనుగు కూడా ఆరాధిస్తూ ఉండేవి. పాము మణులతో స్వామివారిని పూజించేది ఏనుగు తన తొండంతో శివలింగానికి అభిషేకించి, పుష్పాలు, సమర్పించేది. దాంతో పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరింది ఆ బాధను భరించలేక ఏనుగు తన కుంభస్థలాన్ని కొండకు ఢీ కొట్టింది ఏనుగుతో పాటు సర్పం కూడా మరణిస్తుంది. తనను సేవించడం కోసం పోటీపడిన పాముకు ఏనుగుకు స్వామి మోక్షాని ప్రసాదించాడు . ఈ మూడింటి పేరు మీద గాని ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది.

శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు వాటి పేరుతో శ్రీకాళహస్తి ఏర్పడింది.

ఇక్కడ స్వామి వాయు లింగంగా దర్శనమిస్తాడు . అందువలన గర్భాలయంలో స్వామివారికి సమీపంలో వెలిగించిన దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. స్వర్ణముఖి నది తీరంలో సుశీలమైన ప్రదేశంలో నిర్మితమైనది . అంతే కాకుండా
ఇక్కడ శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులలో జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ నృత్యాలతో , వేషధారణలతో రంజింపజేస్తారు . ఈ ఆలయం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకొని కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించుకుని ఆ శ్రీకాళహస్తీశ్వరుని యొక్క ఆశీర్వాదాలు పొందాలి .





Untitled Document
Advertisements